Home న్యూస్ Miss శెట్టి Mr పొలిశెట్టి రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

Miss శెట్టి Mr పొలిశెట్టి రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మరియు జాతిరత్నాలు సినిమాలతో బాక్ టు బాక్ భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ను సొంతం చేసుకున్న నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ అయిన Miss శెట్టి Mr పొలిశెట్టి(Miss Shetty Mr Polishetty Review) తో ఆడియన్స్ ముందుకు రాగా…

సినిమా కి తనదైన స్టైల్ లో భారీ ప్రమోషన్స్ ని చేసిన నవీల్ పొలిశెట్టి ఎంతవరకు అంచనాలను అందుకున్నాడో తెలుగుకుందాం పదండీ….ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే ఫేమస్ చెఫ్ అయిన హీరోయిన్ తన తల్లి చనిపోయిన తర్వాత ఒంటరిగానే ఉండగా…

ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఒక బేబి కావాలని అనుకుంటుంది, కానీ పెళ్లి కాకుండా ఎలాంటి రిలేషన్ షిప్ లేకుండా ఒక బేబి కావాలి అనుకున్న హీరోయిన్ కి స్టాండప్ కామెడీ చేసే హీరో పరిచయం అవుతాడు… ఆ తర్వాత కథ ఏం అయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

కొన్ని కథలు రొటీన్ గానే ఉన్నా ఎంటర్ టైన్ మెంట్ హెల్ప్ తో మెప్పిస్తాయి…ఇలాంటి కోవ లోకే వచ్చే సినిమానే Miss శెట్టి Mr పొలిశెట్టి సినిమా…కథ చాలా రొటీన్ గా అనిపించినా తర్వాత సీన్ ఏమవుతుంది అన్నది ఆడియన్స్ గెస్ చేసేలానే ఉన్నప్పటికీ కూడా…

ఎంగేజింగ్ సీన్స్ తో కొన్ని మంచి కామెడీ సీన్స్ తో మెప్పిస్తూ పెద్దగా బోర్ ఫీల్ అవ్వకుండా అలా అలా ఎంటర్ టైన్ చేస్తూ సాగుతుంది Miss శెట్టి Mr పొలిశెట్టి సినిమా… నవీన్ పొలిశెట్టి ఎక్స్ లెంట్ కామెడీ టైమింగ్ సినిమాలో చాలా చోట్ల మంచి కామెడీని పండించింది…

అనుష్క తన రోల్ వరకు బాగా నటించి మెప్పించింది మిగిలిన నటీనటులు కూడా ఆకట్టుకున్నారు…. ఇక సంగీతం సినిమాలో యావరేజ్ అనిపించేలా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమా ఫీల్ కి తగ్గట్లే ఉంది… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రొటీన్ గానే ఉన్నా పెద్దగా బోర్ ఫీల్ అయ్యే సీన్స్ లేవు కానీ మెలోడ్రామా కొంచం కనెక్ట్ అవ్వలేదు…. 

ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించగా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది… ఇక డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ రొటీన్ గానే ఉన్నా సీన్స్ వైజ్ బాగా ఎంటర్ టైన్ చేశాడు…ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి పెర్ఫార్మెన్స్ సినిమాను చాలా చోట్ల సేఫ్ చేసి ఓ మంచి ఎంటర్ టైనర్ చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ బయటికి రావడం ఖాయం…

సినిమాలో నవీన్ పొలిశెట్టి కామెడీ అండ్ పెర్ఫార్మెన్స్, కామెడీ సీన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ లాంటివి మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే యావరేజ్ ఫస్టాఫ్, వీక్ క్లైమాక్స్, రొటీన్ స్టోరీ అనిపించడం లాంటివి డ్రా బ్యాక్స్…అయినా కూడా సినిమాలో ఉన్న ఎంటర్ టైన్ మెంట్ అలాగే…

పార్టు పార్టులుగా సినిమా టైం పాస్ సీన్స్ తో నిండిపోవడంతో అక్కడక్కడా కొన్ని ఫ్లాస్ అండ్ బోరింగ్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here