Home న్యూస్ మిస్టర్ కేకే…తెలుగు తమిళ్ ఫస్ట్ డే కలెక్షన్స్…షాక్!

మిస్టర్ కేకే…తెలుగు తమిళ్ ఫస్ట్ డే కలెక్షన్స్…షాక్!

0

  ఒకప్పుడు తమిళ్ తెలుగు లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న విక్రం పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం బాలేదు, విక్రం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ కేకే లేటెస్ట్ గా తమిళ్ తో పాటు తెలుగు లో రిలీజ్ అవ్వగా అసలు సినిమాను పట్టించుకున్న వాళ్ళే లేకపోయారు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ కూడా ఏమాత్రం అనుకున్న విధంగా రాలేదు ఈ సినిమా కి…

ఫస్ట్ డే తమిళనాడు లో ఈ సినిమా 4.4 కోట్ల గ్రాస్ ని 2.6 కోట్ల షేర్ ని మాత్రమె సాధించి విక్రం కెరీర్ లో వన్ ఆఫ్ ది లోవెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా సినిమా బిజినెస్ అక్కడ 20 కోట్ల దాకా ఉందని అంటున్నారు. ఆ లెక్కన బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే అని చెప్పాలి.

ఇక తెలుగు లో సినిమాను ఎంతకు అమ్మారు అన్నది క్లియర్ గా రివీల్ చేయలేదు కానీ 2.8 కోట్ల దాకా అమ్ముడు పోయిందని ట్రేడ్ లో టాక్ ఉంది. ఇక ఫస్ట్ డే సినిమా కేవలం 62 లక్షల షేర్ ని మాత్రమె సొంతం చేసుకుందట. ఇక లాంగ్ రన్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here