Home న్యూస్ బాహుబలి రేంజ్ అనుకున్నారు….బడ్జెట్ అండ్ కలెక్షన్స్ లెక్క ఇదే….సాలిడ్ దెబ్బ!

బాహుబలి రేంజ్ అనుకున్నారు….బడ్జెట్ అండ్ కలెక్షన్స్ లెక్క ఇదే….సాలిడ్ దెబ్బ!

0

బాహుబలి రేంజ్ భారీ విజువల్ వండర్ తీయాలని అన్ని ఇండస్ట్రీ ల వాళ్ళు ట్రై చేస్తున్నా కానీ ఎవ్వరూ పెద్దగా సక్సెస్ అవ్వలేక పోతున్నారు, రీసెంట్ గా మలయాళ ఇండస్ట్రీ నుండి మరో ప్రయత్నం జరిగింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన కొత్త సినిమా మలైకోట్టై వాలిబన్(Malaikottai Vaaliban Movie) సినిమా…

ఈ ఇయర్ మలయాళ ఇండస్ట్రీకి భారీగా కలిసి వచ్చింది, వరుసగా ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్ లు సూపర్ హిట్స్ తో ఇండియానే షేక్ చేయగా ఈ సినిమా మీద చాలా ఆశలు ఉండేవి…. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా టేకింగ్ అండ్ విజువల్స్ ఎక్స్ లెంట్ గా మెప్పించినా కూడా సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. దాంతో ఏ దశలో కూడా కలెక్షన్స్ పరంగా జోరు చూపించ లేక పోయిన ఈ సినిమా భారీ డిసాస్టర్ మూవీ గా నిలిచింది ఇప్పుడు.

సినిమా కోసం ఆల్ మోస్ట్ 50 కోట్ల రేంజ్ లో భారీ బడ్జెట్ తో భారీ కాన్వాయ్ తో సినిమాను నిర్మించగా ప్రమోషన్ అండ్ ప్రింట్స్ ఖర్చులతో కలిపి 53 కోట్ల దాకా ఖర్చు అయ్యిందట… సినిమా ఓవరాల్ గా కేరళలో 17 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు టోటల్ ఓవర్సీస్ లో 14 కోట్ల కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సాధించగా మొత్తం మీద 33 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుందట.

అందులో వర్త్ షేర్ 14.50 కోట్ల దాకా ఉంటుందని అంచనా… ఆ లెక్కన బడ్జెట్ పరంగా చూసుకుంటే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా కొంత రికవరీ అయినా కూడా ఈ సినిమా భారీగా నిరాశ పరిచే రిజల్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని డిసాస్టర్ గా పరుగును కంప్లీట్ చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి. దాంతో ఈ ఇయర్ భారీ హిట్స్ పడినా కూడా బడ్జెట్ పరంగా వన్ ఆఫ్ ది బిగ్ ఫ్లాఫ్స్ లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here