బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ వారం ఒకటికి మించి సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్న విషయం తెలిసిందే, పోటి లో ఒకటి అరా సినిమాలు విజయాలుగా నిలుస్తూ ఉంటే మిగిలిన సినిమాలు మాత్రం ఫ్లాఫ్స్ అవుతున్నాయి. ఈ సారి రీసెంట్ టైం లో వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న ముగ్గురు హీరోల మధ్య పోరు ఈ శుక్రవారం జరగబోతుంది, మంచు విష్ణు నటించిన మోసగాళ్ళు, కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా మరియు..
ఆది నటిస్తున్న శశి సినిమాలు రిలీజ్ కానుండగా మూడు సినిమాల థియేటర్స్ కౌంట్ బయటికి వచ్చింది, ఆ వివరలాను గమనిస్తే, మూడు సినిమాల నైజాం థియేటర్స్ ని గమనిస్తే… మోసగాళ్ళు సినిమా 85 థియేటర్స్ లో ఇక్కడ రిలీజ్ కానుండగా శశి సినిమా 82 థియేటర్స్ లో ఇక్కడ రిలీజ్ కాబోతుంది.
ఇక చావు కబురు చల్లగా సినిమా 151 థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోనుండగా రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే…మోసగాళ్ళు సినిమా 245 థియేటర్స్ లో ఇక్కడ రిలీజ్ కానుండగా శశి సినిమా 220 థియేటర్స్ లో ఇక్కడ రిలీజ్ కాబోతుంది. ఇక చావు కబురు చల్లగా సినిమా 430 థియేటర్స్ లో రిలీజ్ ను…
కన్ఫాం చేసుకున్నాయి. ఉన్నంతలో చావు కబురు చల్లగా భారీ థియేటర్స్ లో రిలీజ్ కానుండగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి 13.5 కోట్లు వసూల్ చేయాల్సి ఉంటుంది, ఇక శశి సినిమా 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సి ఉంటుంది, ఇక మోసగాళ్ళు 50 కోట్ల బడ్జెట్ లో 30 కోట్లు రికవరీ అవ్వగా థియేటర్స్ నుండి 21 కోట్ల షేర్ ని ఓవరాల్ గా అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది.
ఇక అన్ని సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయినా కానీ ఏ సినిమా కి కూడా బుకింగ్స్ అనుకున్న విధంగా అయితే లేవనే చెప్పాలి, అన్ని సినిమాలు మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ కాబోతున్నాయి. మరి ఏ సినిమా కి పాజిటివ్ టాక్ వస్తుంది, అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తాయి అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.