బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) రీసెంట్ టైంలో అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేక పోతున్న విషయం తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన లాస్ట్ 3 సినిమాలు నిరాశాకలిగించే రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు కంబ్యాక్ కి సిద్ధం అవుతున్న రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…
హరీష్ శంకర్ తో కలిసి చేస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mr Bachchan) మూవీ తో ఈ ఆగస్టు 15న రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు భారీగా నే పెరిగాయి అని చెప్పాలి..
ఆల్ మోస్ట్ ట్రైలర్ లో కథని కూడా రివీల్ చేశారు…స్ట్రిక్ట్ ఇన్ కం టాక్స్ ఆఫీసర్ అయిన హీరో ఒక పక్క తను ప్రేమించిన అమ్మాయితో ప్రేమలో హ్యాప్పీగా ఉండగా మరో పక్క ఒక కరుడుగట్టిన విలన్ దగ్గర ఉన్న లెక్కలేనంత బ్లాక్ మనీని రికవరీ చేయాల్సిన భాద్యత పడుతుంది…
ఆ కరుడుగట్టిన విలన్ అయిన అయిన జగబపతిబాబు ఇంటికి టీం తో వెళ్ళిన హీరో ఏం చేశాడు అన్నది మిగిలిన కథ పాయింట్ గా ట్రైలర్ లో చూపించారు…ఒరిజినల్ వర్షన్ రైడ్ మూవీ కథ కంప్లీట్ గా సీరియస్ గా సాగితే ఇక్కడ కథ పాయింట్ ని లవ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు…
సెకెండ్ ఆఫ్ లో సీరియస్ టర్న్ తీసుకునే కథగా మార్చినట్లు ట్రైలర్ చూస్తె అర్ధం అవుతుంది. రవితేజ మాస్ డైలాగ్స్ ఆకట్టుకోగా బ్యాగ్రౌండ్ స్కోర్ యాక్షన్ పార్ట్ సినిమాలో చాలానే ఉందని ట్రైలర్ చూపించడంతో థియేటర్స్ లో చూసేటప్పుడు ఈ సీన్స్ ని సాలిడ్ రెస్పాన్స్ ఉండే అవకాశం ఎంతైనా ఉంది.
ఓవరాల్ గా హరీష్ శంకర్ మరోసారి ఒరిజినల్ ని కోర్ పాయింట్ ను తీసుకుని తెలుగు ఆడియన్స్ కి భాగా నచ్చేలా మార్చినట్లు తెలుస్తుంది. ఒరిజినల్ మెప్పించినట్లు రీమేక్ కూడా మెప్పిస్తే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రవితేజ మాస్ కంబ్యాక్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది.