బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన రీసెంట్ మూవీస్ అంచనాలను అందుకోలేక పోయాయి. ధమాకా(Dhamaka) మూవీ తర్వాత చేసిన సినిమాలు అంచనాలను అందుకోలేక పోయాయి. ఇలాంటి టైంలో తనకి మిరపకాయ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న…
లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie Pre Release Business) సినిమా బాలీవుడ్ లో మంచి హిట్ గా నిలిచిన రైడ్ మూవీకి రీమేక్ గా వస్తున్న సినిమానే అయినా తెలుగులో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి ఈ సినిమాను రూపొందించగా…
ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ సినిమా మీద మంచి హైప్ ను పెంచేలా చేశాయి అని చెప్పాలి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పోటిలో సైతం సినిమా ఇప్పుడు ఎక్స్ లెంట్ బిజినెస్ ను సొంతం చేసుకుని వరుస ఫ్లాఫ్స్ తో కూడా మాస్ రచ్చ చేసే బిజినెస్ తో దుమ్ము లేపింది…
ఒకసారి సినిమా సాధించిన వాల్యూ బిజినెస్ లెక్కలను గమనిస్తే..
#MrBachchan WW Valued Business
👉Nizam: 11.50Cr
👉Ceeded: 4Cr
👉Andhra: 11.50CR
AP-TG Total:- 28CR
👉KA+ROI: 2Cr
👉OS – 2Cr
Total WW: 31.00CR( Break Even – 32CR~)
మొత్తం మీద సినిమా ఓవరాల్ వాల్యూ బిజినెస్ రేంజ్ 31 కోట్ల రేంజ్ లో ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే మినిమమ్ 32 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. సినిమాకి బజ్ భారీగానే ఉండటంతో…
ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా కూడా లాంగ్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో మిస్టర్ బచ్చన్ మూవీ మంచి జోరుని చూపించి టార్గెట్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాతో రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక…