Home న్యూస్ ఖుషి ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేసిన మురారి…ఇది ఎవ్వరూ ఊహించని భీభత్సం!!

ఖుషి ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేసిన మురారి…ఇది ఎవ్వరూ ఊహించని భీభత్సం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం నుండి టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ కి మంచి ఊపు రాగా వరుస పెట్టి రీ రిలీజ్ లు అవ్వడం, బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటికి మించి ఒక సినిమా అంచనాలను మించి జోరు చూపగా ఎలాంటి అకేషన్ లేకుండా న్యూ ఇయర్ వీకెండ్ లో రిలీజ్ అయిన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన…

ఖుషి(Kushi4K) మూవీ ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. రీ రిలీజ్ లు ఒకటి రెండు రోజులకే పరిమితం అయిన టైంలో ఈ సినిమా ఏకంగా వారానికి పైగానే రన్ ని సొంతం చేసుకుని అంచనాలను మించి పోయి టోటల్ రన్ లో 7.46 కోట్ల రేంజ్ లో…

గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని టాలీవుడ్ రీ రిలీజ్ మూవీస్ లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది….ఈ రికార్డ్ కలెక్షన్స్ ని తర్వాత వచ్చిన ఏ టాలీవుడ్ రీ రిలీజ్ కూడా టచ్ చేయలేక పోయింది. దాంతో కొంత కాలం టాప్ లో అలాగే ఉన్న ఈ రికార్డ్ రీ రిలీజ్ కలెక్షన్స్ ని…

రీసెంట్ గా అసలు ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ కూడా చేయని విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన ఓల్డ్ క్లాసిక్ మూవీ మురారి(Murari4K) మూవీ ఇప్పుడు జస్ట్ 3 రోజుల గ్యాప్ లో బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది…ఈ టైంలో ఇది మరింత స్పెషల్ అని చెప్పాలి.

ప్రజెంట్ రీ రిలీజ్ ల ట్రెండ్ కంప్లీట్ గా ఆగిపోయిన టైంలో ఎంత క్లాసిక్ అయినా కూడా ఇప్పటి ఆడియన్స్ ను అనుకున్న రేంజ్ లో థియేటర్స్ రప్పిస్తుందో లేదో అన్న డౌట్స్ ఉన్నా కూడా మురారి మూవీ టికెట్ సేల్స్ లో ఊహకందని ట్రెండ్ ను చూపించగా…

రెండున్నర లక్షలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసి 2 రోజుల్లోనే 7.32 కోట్ల గ్రాస్ ను అందుకోగా 3వ రోజు కలెక్షన్స్ తో ఖుషి రీ రిలీజ్ కలెక్షన్స్ ని దాటేసి సంచలన రికార్డ్ ను నమోదు చేసిన ఈ సినిమా ఇప్పుడు ఆగస్టు 15 వీకెండ్….

మూవీస్ వచ్చే వరకు కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండటంతో…అప్ కమింగ్ టాలీవుడ్ రీ రిలీజ్ మూవీస్ కి బిగ్గెస్ట్ టార్గెట్ నే సెట్ చేయబోతుంది….మరి మురారి నెలకొల్పిన ఈ రికార్డ్ కలెక్షన్స్ ని అప్ కమింగ్ రీ రిలీజ్ మూవీస్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.

Murari4K Re Release Box Office Collections Report!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here