Home న్యూస్ డే1 రికార్డ్…లాంగ్ రన్ వీక్….మురారి రికార్డ్ బ్రేక్ అవ్వలేదుగా!

డే1 రికార్డ్…లాంగ్ రన్ వీక్….మురారి రికార్డ్ బ్రేక్ అవ్వలేదుగా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పుడప్పుడు కొన్ని రీ రిలీజ్ లు ఆడియన్స్ నుండి ఊహించని రేంజ్ లో సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటాయి…అలాంటి వాటిలో రీసెంట్ గా వచ్చిన మహేష్ బాబు(Mahesh Babu) నటించిన మురారి(Murari) మూవీ ఒకటి….మహేష్ బాబు బర్త్ కి రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని రేంజ్ లో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంది…

దాంతో అప్ కమింగ్ రీ రిలీజ్ లకు సాలిడ్ టార్గెట్ ను సెట్ చేయగా ఈ టార్గెట్ ను బ్రేక్ చేయడమే ధ్యేయంగా భారీ రిలీజ్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన గబ్బర్ సింగ్(Gabbar Singh) మూవీ ఓపెనింగ్ డే రోజున సాలిడ్ రికార్డునే నమోదు చేసింది…

గబ్బర్ సింగ్ మొదటి రోజు సాలిడ్ రికార్డును నమోదు చేసిన తర్వాత రెండో రోజు నుండి కంప్లీట్ గా డౌన్ అయిన సినిమా ఓవరాల్ గా మూడు రోజుల్లో టోటల్ గా 7.90~ కోట్ల రేంజ్ కి అటూ ఇటూగానే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా… దాంతో ఓపెనింగ్ డే రోజున రికార్డ్ కొట్టినా కూడా…

లాంగ్ రన్ పరంగా ఖుషి రేంజ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకోలేదు. ఇక మురారి మూవీ కూడా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ తర్వాత రెండో రోజు 1.76 కోట్ల గ్రాస్ ను తర్వాత రోజుల్లో వరల్డ్ వైడ్ గా 2.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి ఓవరాల్ గా…

8.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో గబ్బర్ సింగ్ ఇక మురారిని అందుకునే అవకాశమే లేక పోవడంతో మొదటి రోజు రికార్డు వరకు గబ్బర్ సింగ్, లాంగ్ రన్ రికార్డ్ వరకు మాత్రం మురారి ఇప్పటికీ టాప్ లోనే ఉంది. ఇక ఫ్యూచర్ లో ఏ సినిమా ఈ రికార్డ్ ను అందుకుంటుందో చూడాలి.

Murari4K Re Release Box Office Collections Report!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here