రెండో సినిమా కే ఇండస్ట్రీ రికార్డులను చెల్లా చెదురు చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర సినిమా తర్వాత చేసిన సినిమా ఆరెంజ్. మగధీర కి పూర్తీ కాంట్రాస్ట్ గా లవ్ స్టొరీ ని ఎంచుకున్న రామ్ చరణ్ తన బాబాయ్ నాగబాబు నిర్మాణంలో ఈ సినిమా ను చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోవడం లో విఫలం అయిన ఈ సినిమా భారీ డిసాస్టర్ మూవీ గా పరుగును ముగించింది.
లవ్ స్టొరీ నే అయినా ఫారన్ లొకేషన్స్ లోనే షూటింగ్ అవ్వడం తో బడ్జెట్ హద్దులు దాటి ఏకంగా 46 కోట్ల రేంజ్ బడ్జెట్ అయ్యింది అప్పట్లోనే… దాంతో నిర్మాత నాగ బాబు ఈ సినిమా విషయం లో చాలా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను సొంతం చేసుకోవడం తో ఆర్ధికంగా నాగబాబు మరింతగా క్షీణించిపోయిన టైం లో చిరు, పవన్ లు నాగబాబు ని తమ వంతుగా ఆదుకున్నారని పలు సందర్భాలలో నాగబాబు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా సోషల్ మీడియా లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ సెషన్ లో…
నాగబాబు ని ఆరెంజ్ సినిమా గురించిన ప్రశ్నని అడగ్గా నాగబాబు జవాబు అందరినీ ఆశ్యర్యపరిచింది… ఒక ఫాలోవర్… ఆరంజ్ సినిమా ఫ్లాప్ తర్వాత చరణ్ మనీ.. అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు నాగబాబు సమాధానంగా… లేదు మా అన్నయ్య నా అప్పుల్లో సగం తీర్చాడు. చరణ్ కి ఫ్యూచర్ లో రెమ్యూనరేషన్ ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు. అంటే రామ్ చరణ్ కు రెమ్యూనరేషన్…
ఇప్పటికీ దక్కలేదన్న మాట.. హీరో రెమ్యునరేషన్ కాకుండానే సినిమా కి అంత బడ్జెట్ అవ్వడం విచారకరం అనే చెప్పాలి. కానీ ఇప్పుడు నాగబాబు ఫ్యూచర్ లో చేసే సినిమాలతో రామ్ చరణ్ రెమ్యునరేషన్ ని క్లియర్ చేస్తానన్న నమ్మకాన్ని తెలియజేశారు. మొత్తం మీద చాట్ సెషన్ వలన ఆరెంజ్ బడ్జెట్ మెయిన్ హీరో రెమ్యునరేషన్ ని పక్కకు పెట్టినా అంత అయ్యింది అని ఇప్పుడు క్లారిటీ వచ్చింది.