యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా లవ్ స్టొరీ. సమ్మర్ రేసు లో నిలవాల్సిన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ తో బాలెన్స్ షూట్ ఆగి పోగా వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటున్న ఈ సినిమా కి సంభందించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.
లాస్ట్ ఇయర్ మజిలీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాగ చైతన్య కెరీర్ లో మొట్ట మొదటి 40 కోట్ల షేర్ సినిమాను తన ఖాతాలో వేసుకోగా అప్ కమింగ్ మూవీ అయిన లవ్ స్టొరీ పై కూడా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి…
ఫిదా తో శేఖర్ కమ్ముల బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టడం, ఫిదా తర్వాత సాయి పల్లవి మరోసారి శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేస్తూ ఉండటం, అందరూ తమ లాస్ట్ మూవీస్ తో హిట్ కొట్టడం తో ఈ సినిమా పై క్రేజ్ సాలిడ్ గా ఉండగా సినిమా ఇప్పుడు తిరిగి బాలెన్స్ షూటింగ్ ని మొదలు పెట్టారు.
ఇంకో వారంలో సినిమా బాలెన్స్ షూటింగ్ మొత్తం పూర్తీ కాబోతుందని సమాచారం…. ఈ విషయం తెలుసుకున్న లీడింగ్ OTT యాప్స్ ఇప్పుడు ఈ సినిమాకి భారీ ఆఫర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాయి అని లేటెస్ట్ టాక్. సినిమా కి ట్రేడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఏకంగా 25 కోట్ల రేంజ్ ఆఫర్ దక్కిందని టాక్.
ఇది నాగ చైతన్య లాస్ట్ మూవీ మజిలీ తో పోల్చితే ఆల్ మోస్ట్ 4 కోట్లు అధికం అనే చెప్పాలి. కానీ యూనిట్ నుండి ఇంకా ఎలాంటి రిటర్న్ రిప్లే లేదని తెలుస్తుంది. ముందు నుండి సినిమా థియేటర్ రిలీజ్ అనే అన్నారు, కుదిరితే సంక్రాంతి కి కూడా ఛాన్స్ ఉంది అన్నారు, మరి OTT ఆఫర్ కి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో అన్నది తెలియాల్సి ఉంది..