Home గాసిప్స్ ఇది నిజం అయితే…నాగచైతన్య రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం!!

ఇది నిజం అయితే…నాగచైతన్య రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం!!

0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం మజిలీ బ్లాక్ బస్టర్ హిట్ తో యమ జోరు మీదున్న విషయం తెలిసిందే. కెరీర్ లో చాలా కాలంగా ఎదురు చూస్తన్న ఒక నికార్సయిన బ్లాక్ బస్టర్ ని లవ్ స్టొరీ తోనే సొంతం చేసుకున్నాడు నాగ చైతన్య. ఇక ఈ సినిమా తో మొట్ట మొదటి సారిగా 40 కోట్ల క్లబ్ లో కూడా ఎంటర్ అయ్యు సంచలనం సృష్టించాడు నాగ చైతన్య.

ఇక మజిలీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాగ చైతన్య చేస్తున్న సినిమా లవ్ స్టొరీ. ఫిదా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై కూడా సాలిడ్ గా బజ్ ఉందని చెప్పాలి.

రీసెంట్ గా సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఏకంగా 16 కోట్ల రేంజ్ లో జరిగి దుమ్ము లేపింది. ఇక ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటె సమ్మర్ ఎండ్ టైం లో రిలీజ్ అయ్యి ఉండేది కానీ ఇప్పుడు సినిమా మంచి డేట్ చూసుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ ఏడాది దసరా రేసులో ఉంటుంది అనుకున్నా టీం మాత్రం ఈ ఏడాది ఇక ఆడియన్స్ థియేటర్స్ పెద్దగా వచ్చేలా లేరు అని డిసైడ్ అయ్యారు. దాంతో ఈ ఏడాది అస్సలు రిలీజ్ పెట్టుకోవద్దని… కుదిరితే వచ్చే ఏడాది సంక్రాంతి రేసు లో సినిమా ను నిలపాలి అని టీం అనుకుంటున్నట్లు సమచారం. ఇది కనుక నిజం అయితే కచ్చితంగా…

బాక్స్ ఆఫీస్ దగ్గర నాగ చైతన్య కెరీర్ లోనే కాదు టైర్ 2 హీరోల్లో బిగ్గెస్ట్ రికార్డులు నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు భారీ వసూళ్ళతో రెచ్చిపోతున్నాయి. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ లో శేఖర్ కమ్ముల కి మంచి పేరుంది. అది సినిమాకి మరింతగా కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పాలి. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here