బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీ కోవిడ్ టైంలో సోలో సూపర్ హిట్స్, మల్టీ స్టారర్ హిట్స్ తో మంచి జోరు మీద ఉన్నప్పటికీ కూడా తర్వాత వరుసగా 2 ఎపిక్ డిసాస్టర్స్ తో రేసులో పూర్తిగా స్లో డౌన్ అయిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమాతో ఇప్పుడు ఎక్స్ లెంట్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్నాడు…
కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన తండేల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అందుకుని అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి మాస్ రచ్చ చేసింది. కెరీర్ లో ఎపిక్ డిసాస్టర్స్ తర్వాత ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంది…
ప్రీవియస్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ కన్నా కూడా సాలిడ్ ఓపెనింగ్స్ తో కుమ్మేసింది. ఇది వరకు లవ్ స్టోరీ మూవీతో కోవిడ్ తర్వాత 50% ఆక్యుపెన్సీతోనే 7 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న నాగ చైతన్య ఇప్పుడు 2 డిసాస్టర్స్ తర్వాత అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో ఏకంగా 8.54 కోట్ల షేర్ ఓపెనింగ్స్ ను అందుకున్నాడు…
ఒకసారి నాగ చైతన్య నటించిన రీసెంట్ మూవీస్ మొదటి రోజు కలెక్షన్స్ ని గమనిస్తే…
#NagaChaitanya Recent Movies 1st Day AP TG Shares
👉#Thandel – 8.54CR*******
👉#Custody – 1.82CR
👉#ThankYou – 1.65Cr
👉#LoveStory – 7.13CR
👉#Majili – 5.6Cr
👉#SavyaSachi – 3.29Cr
👉#ShailajaReddyAlludu – 6.93Cr
👉#Bangarraju – 9.06CR(Multi Starer)
👉#VenkyMama- 7.05Cr(Multi Starer)
ఓవరాల్ గా అన్ని సినిమాలు కలిపి చూస్తె కెరీర్ లో సెకెండ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకోగా సోలో హీరోగా డీసెంట్ మార్జిన్ తో కెరీర్ బెస్ట్ ను నమోదు చేసిన నాగ చైతన్య ఇప్పుడు లాంగ్ రన్ లో తండేల్ మూవీ తో తొలిసారి 50 కోట్ల షేర్ క్లబ్ లో చేరతడా లేదా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.