Home గాసిప్స్ నాని కి కోపం వచ్చింది….కారణం ఇదే అంటున్నారే!

నాని కి కోపం వచ్చింది….కారణం ఇదే అంటున్నారే!

0

నాచురల్ స్టార్ నాని బాక్స్ ఆఫీస్ దగ్గర జెర్సీ సూపర్ హిట్ తర్వాత కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా సుదీర్ బాబు తో కలిసి చేసిన వి ది మూవీ డిజిటల్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యి కంప్లీట్ గా నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుని షాకిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా మినిమమ్ ఆడియన్స్ ను అలరించలేక పోయింది కానీ అమెజాన్ ప్రైమ్ లో…

వ్యూస్ పరంగా దుమ్ము లేపే రేంజ్ లో వ్యూస్ ని సొంతం చేసుకుందని సమాచారం… పెట్టిన రేటు కి న్యాయం కూడా చేసింది, ఇక ఈ సినిమా తర్వాత నాని చేస్తున్న లేటెస్ట్ మూవీ టక్ జగదీష్… బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ కానుకగా రావాల్సిన ఈ సినిమా…

కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న నానికి సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన సినిమా పోస్ట్ పోన్ అవ్వడం తో ఎప్పుడెప్పుడు సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకు వద్దామా అని ఉందని చెప్పొచ్చు. ఇదే టైం లో అడును చూసుకుని…

సినిమా ను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయించాలని లీడింగ్ OTT యాప్స్ అన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయని తెలుస్తుంది… కాగా లేటెస్ట్ గా భారీ ఆఫర్ రావడం తో నిర్మాత ఈ విషయాన్ని నాని దగ్గరకు తీసుకు వెళ్లి డైరెక్ట్ రిలీజ్ పై మంచి ఆఫర్స్ వస్తున్నాయని చెప్పంగా నాని ఒకింత కోపంతోనే నో చెప్పాడని తెలుస్తుంది…

సినిమా తీసింది ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో తీసుకు రావాలని, ఇలా డిజిటల్ లో రిలీజ్ చేయడానికి కాదు, వి మూవీ విషయం లో డిజిటల్ రిలీజ్ వల్ల దెబ్బ పడింది. ఈ సారి అలా జరగకూడదు అంటూ ఎట్టి పరిస్థితులలో కూడా సినిమాను థియేటర్స్ లోనే పరిస్థితులు ఓకే అయ్యాక రిలీజ్ చేయాలనీ గట్టిగా చెప్పారని టాలీవుడ్ లో అంటున్నారు. సో టక్ జగదీష్ దిగేది థియేటర్స్ లోనే అని కన్ఫాం చేసుకోవచ్చు ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here