Home న్యూస్ 1.8 కోట్ల రేటు…ఫస్ట్ డే ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలిస్తే షాకవ్వాల్సిందే!!

1.8 కోట్ల రేటు…ఫస్ట్ డే ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలిస్తే షాకవ్వాల్సిందే!!

0

అనసూయ ప్రధాన పాత్రలో ఎలివేటర్ బేబీ మూవీ కి రీమేక్ గా రూపొందిన లేటెస్ట్ మూవీ థాంక్ యు బ్రదర్, బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతుంది అనుకున్న ఈ సినిమా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ పీక్స్ లో ఉండటం తో థియేటర్స్ లో రిలీజ్ ను స్కిప్ చేసి డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను ఆహా యాప్ లో రీసెంట్ గా సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

సినిమా లెంత్ తక్కువే ఉన్నా కథ కోర్ పాయింట్ బాగున్నా ట్రీట్ మెంట్ పరమ రొటీన్ గా ఉండటం తో బిలో పార్ రివ్యూ లనే ఈ సినిమా సొంతం చేసుకుంది, అయినా కానీ అవేవి సినిమా కి వ్యూస్ బాగా రావడాన్ని ఆపలేదు అని తెలుస్తుంది.

ఆహా యాప్ లో సినిమాకి మొదటి రోజు కి గాను మంచి వ్యూస్ కౌంట్ లభించింది అని అంటున్నారు. ఎంత అనేది క్లియర్ నంబర్స్ చెప్పకున్నా కానీ… మొదటి 24 గంటల్లో సినిమా కి లక్షా 10 వేల రేంజ్ లో యూనిక్ వ్యూస్ లభించాయని అంచనా టాక్ ట్రేడ్ లో లో చెబుతున్నారు….

సినిమాను మొత్తం మీద ఆహా యాప్ వాళ్ళు 1.8 కోట్ల రేటు కి కొన్నారు, ఆ లెక్కన సినిమా వాళ్ళకి మంచి లాభాలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది, ఇక లక్షా 10 వేల రేంజ్ వ్యూస్ కి ఎంత అమౌంట్ యావరేజ్ గా వచ్చి ఉండొచ్చు అన్నది అంచనా వేస్తె ఆహా యాప్ ఒక నెల రేటు 50 ని టికెట్ రేటు గా భావిస్తే… 1 లక్షా 10 వేల వ్యూస్ కి…

50 టికెట్ రేటు తో… 55 లక్షల్ల మేర గ్రాస్ వచ్చి ఉండొచ్చని అంచనా వేయొచ్చు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినా ఇలాంటి ఓపెనింగ్స్ సాధ్య పడవు అనే చెప్పొచ్చు. డిజిటల్ రిలీజ్ లో వ్యూస్ ఇలానే కొనసాగిస్తే సినిమా ను కొన్న రేటు కి మంచి వ్యూవర్ షిప్ ను ఆహా లో థాంక్ యు బ్రదర్ సొంతం చేసుకునే చాన్స్ ఉంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here