లాక్ డౌన్ టైం లో వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేయడం తో ఇప్పుడు వేయడానికి సినిమాలు లేక పోవడం తో స్టార్ మా ఛానెల్ ఒక మంచి ఉపాయం ఆలోచించింది… శాటిలైట్ రైట్స్ కొన్ని కారణాల వల్ల అమ్ముడు కాని ఓల్డ్ మూవీస్ ని ఎంతో కొంత రేటు చెల్లిస్తూ వాటికి కొంచం పబ్లిసిటీ చేసి టెలివిజన్ లో టెలికాస్ట్ చేస్తూ మంచి రేటింగ్స్ ని దక్కించుకుంటూ లీడ్ లో దూసుకు పోతుంది.
ఈ క్రమంలో ఇప్పుడు 7 ఏళ్ల క్రితం మొదలు అయ్యి 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన నాచురల్ స్టార్ నాని నటించిన “జెండా పై కపిరాజు” సినిమా ను ఇప్పుడు టెలికాస్ట్ చేయడానికి సిద్ధం అవుతుంది. ఈ సినిమా ను సముద్రఖని డైరెక్ట్ చేయగా…
భారీ డిలే అవ్వడం, కొన్ని ఆర్ధిక కారణాలు కూడా ఉండటం తో లేట్ అవుతూ అవుతూ ఒకేసారి నాని నటించిన మరో సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం ఈ సినిమా ఓకే సారి రిలీజ్ అయ్యాయి. ఆ సినిమా బ్రేక్ ఈవెన్ ఆల్ మోస్ట్ అవ్వగా ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ ని అందుకుంది.
శాటిలైట్ రైట్స్ ఎవ్వరూ కొనకపోవడం తో సినిమా అలాగే ఉండి పోగా ఇప్పుడు స్టార్ మా ఛానెల్ వారు ఈ సినిమా ను కొని ఈ ఆదివారం 12 గంటలకు టెలికాస్ట్ చేయబోతున్నారు. కాగా ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమా ను సుమారు 2 కోట్లకు అటూ ఇటూ గా రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ ని దక్కించుకున్నారని టాక్ ఉంది.
టాలీవుడ్ లో ఒక హీరో సినిమాలు ఓకె రోజు రెండు రిలీజ్ అవ్వడం మొదట బాలయ్య కి జరగగా తర్వాత నాని కి జరిగింది. ఈ సినిమా లో తన డ్యూయల్ రోల్ నటన అద్బుతం అనే చెప్పాలి. నెగటివ్ షేడ్స్ ఉండే పాత్రలో నాని అద్బుతంగా నటించారు. అందరూ దాదాపు మర్చిపోయిన ఈ సినిమా ఇప్పుడు టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యాక మళ్ళీ మాట్లాడుకోవడం ఖాయమని చెప్పొచ్చు….