Home న్యూస్ జెర్సీ రివ్యూ రేటింగ్…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్

జెర్సీ రివ్యూ రేటింగ్…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్

0

నాచురల్ స్టార్ నాని కి 2017 వరకు అద్బుతంగా కలిసి వచ్చింది, కానీ 2018 మాత్రం అనుకున్న రేంజ్ లో కలిసి రాలేదు, ఇలాంటి సమయం లో రొటీన్ మూవీ జోలి కి వెళ్ళకుండా జెర్సీ అంటూ ఎమోషనల్ ఫ్యామిలీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని, ఓవర్సీస్ లో ఇప్పటికే మంచి టాక్ ని సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు అసలు సిసలు కామన్ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారింది.

JERSEY Pre-Release Business...Big Target To Achieve

కథ: క్రికెట్ ని ఇష్టపడే నాని హీరోయిన్ తో లవ్ పడ్డాక అనుకోకుండా క్రికెట్ కి దూరం అవుతాడు, తర్వాత హీరోయిన్ పై డిపెండ్ అయ్యి జీవితంలో అనేక అవమానాలను ఎదురుకుంటున్నా కానీ వాటన్నింటిని భరించే హీరో తన కొడుకు కోసం 36 ఏళ్ల వయసులో మళ్ళీ క్రికెట్ మొదలు పెడతాడు. తర్వాత ఎం జరిగింది అన్నది అసలు కథ.

కథ పాయింట్ రొటీన్ గా అనిపించినా తెరకెక్కించే క్రమంలో దర్శకుడు చాలా ఎమోషనల్ గా క్యారెక్టర్స్ తో కనెక్ట్ అయ్యే విధంగా స్క్రీన్ ప్లే ని రాసుకున్నాడు, ఈ క్రమంలో ఎక్కువ గా వచ్చే ఎమోషనల్ సీన్స్ కొంచం బోర్ కొట్టించినా జెర్సీ మనసు గెలుచుకుంటుంది.

మీరు రెగ్యులర్ మూవీస్ చూసి చూసి అలాంటి సినిమానే కావాలని జెర్సీ కి వెళితే నాని సినిమా లో ఎంటర్ టైన్ మెంట్ లేదు అని ఫీల్ అవుతారు, సినిమా యావరేజ్ గా అనిపిస్తుంది, కానీ ఒక డిఫెరెంట్ మూవీ ని చూస్తున్నాం అని ముందే ప్రిపేర్ అయితే…

జెర్సీ సినిమా సినిమా అయ్యాక కూడా మనతో బయటికి వచ్చే సినిమా, నాని ఇప్పటి వరకు చేసిన సినిమాలలో కన్నా కూడా ఈ సినిమా చాలా బెటర్ గా పెర్ఫార్మ్ చేసి నాచురల్ స్టార్ అన్న పేరు నిలబెట్టుకున్నాడు, సినిమాలో తానె నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, సినిమా మొత్తం నాని మెస్మరైజ్ చేస్తాడు.

ఇక హిరోయిన్ ఫస్ట్ సినిమానే అయినా పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది, పాత్ర కి చాలా వెయిట్ ఉన్నా కానీ ఆ భాద్యతని సక్రమంగా మెప్పించింది, ఇక కొడుకు పాత్ర చేసిన అబ్బాయి కూడా ఆకట్టుకుంటాడు, మిగిలిన పాత్రలు కూడా తమ పరిది మేరకు మెప్పిస్తాయి.

ఇక సినిమా కి వెన్నెముకగా అనిరుద్ అందించిన సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ నిలిచాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సినిమా స్క్రీన్ ప్లే బాగున్నా అక్కడక్కడా డోస్ పెరిగిన ఎమోషనల్ సీన్స్ కొంచం తగ్గిస్తే బాగుండేది అనిపిస్తుంది, కానీ సినిమా ఎమోషనల్ రైడ్ కాబట్టి అది తట్టుకోవాల్సిందే.

ఇక డైరెక్షన్ పరంగా గౌతమ్ తొలి సినిమానే అయినా ఫుల్ మార్కులు దక్కించుకున్నాడు, రీసెంట్ టైం లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా జెర్సీ ని తెరకెక్కించాడు. సినిమా లో ఇంటర్వల్ పాయింట్, క్లైమాక్స్ ఎపిసోడ్ ని అద్బుతంగా తెరకెక్కించాడు దర్శకుడు.

ఓవరాల్ గా హైలెట్స్ విషయానికి వస్తే
*నాని పెర్ఫార్మెన్స్
*అనిరుద్ సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్
*ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్స్
*డైరెక్షన్
ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే
*లెంగ్త్ ఎక్కువ అవ్వడం
*కొన్ని సీన్స్ ని ఎక్కువగా డ్రాగ్ చేసి మరింత ఎమోషనల్ గా తీయడం

ఇదీ ఓవరాల్ గా సినిమా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్… జెర్సీ నాని కి నికార్సయిన కంబ్యాక్ మూవీ, మంచి సినిమాలకు కోరుకునే ఆడియన్స్ కి జెర్సీ మనసు గెలుచుకునే సినిమా, రొటీన్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వారు సినిమా ను ఎంతవరకు ఆదరిస్తారు అన్నదానిపై సినిమా విజయవాకశాలు ఆధారపడి ఉన్నాయి.

JERSEY Pre-Release Business...Big Target To Achieve

సినిమా ఫైనల్ గా మేం ఇస్తున్న రేటింగ్….. 3.25 స్టార్స్…. ఎన్టీఆర్ కి ఒక టెంపర్, మహేష్ కి ఒక పోకిరి, పవన్ కళ్యాణ్ కి ఒక గబ్బర్ సింగ్, రామ్ చరణ్ కి ఒక రంగస్థలం ఎలాగో నాని కి ఇది అలాంటి కెరీర్ టర్నింగ్ మూవీ అవుతుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here