ఒక్క సారిగా టాలీవుడ్ లో పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ ఇయర్ కరోనా పాండమిక్ తర్వాత ఇండియా లోనే వరుస విజయాలతో దూసుకు పోయిన టాలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్స్ తో పాండమిక్ ని జయించి పరిస్థితులు అతి తక్కువ టైం లో నార్మల్ అయ్యేలా చూసుకున్నా కానీ ఇప్పుడు మళ్ళీ సెకెండ్ వేవ్ మరింత భారీగా జోరు అందుకుంటున్న నేపధ్యంలో వరుస పెట్టి సినిమాలు రిలీజ్ డేట్ లను మార్చుకుంటూ పోతూ ఉన్నాయి.
రీసెంట్ గా లవ్ స్టొరీ సినిమా రిలీజ్ డేట్ ని మార్చేసి పరిస్థితులు నార్మల్ అయ్యాకే ఆడియన్స్ ముందుకు వస్తామని చెప్పగా మే నెలలో రావాల్సిన ఆచార్య ఆల్ మోస్ట్ పోస్ట్ పోన్ కన్ఫాం అయింది, ఇక ఈ నెలలో ఆడియన్స్ ముందుకు ఎట్టి పరిస్థితులలో 23 న రావాల్సిన నాచురల్ స్టార్ నాని…
నటించిన లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ సినిమా కూడా ఇప్పుడు రిలీజ్ డేట్ కు రావడం లేదని అఫీషియల్ గా కన్ఫాం చేసింది, సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ అని బయటికి చెబుతున్నా కానీ అసలు విషయం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
రీసెంట్ గా భారీగా టికెట్ హైక్స్ తో సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటం వకీల్ సాబ్ సినిమాకి మరింత పెంచడం లాంటివి నచ్చని ప్రభుత్వం అన్ని సినిమాలకు కొత్త టికెట్ రేట్లని కన్ఫాం చేసింది, ఆ రేట్లు ఏకంగా 8 ఏళ్ల క్రితం ఉన్న రేట్లు అవ్వడం తో ఆ రేట్లతో సినిమాలు థియేటర్స్ లో నడపలేమని చాలా థియేటర్స్ బుకింగ్స్ ని ఆపడమో థియేటర్స్ ని మూసేయడమో చేశాయి.
దాంతో ఈ పరిస్థితుల్లో కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం ఆ కలెక్షన్స్ ఎలా ఉంటాయో అన్న ఆందోళన ఉండటం తో చాలా సినిమాలు ఇప్పుడు రిలీజ్ డేట్స్ ని మార్చుకుంటూ ఉన్నాయని తెలుస్తుంది, టక్ జగదీష్ కూడా ఇప్పుడు ఈ కారణం వల్లే రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకుందని పరిస్థితులు సద్దుకుంటే త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని అంటున్నారు.