నట సింహం నందమూరి బాలకృష్ణ ఎంతో ఇష్టపడి తనే డైరెక్టర్ గా మారి మొదలు పెట్టిన సినిమా నర్తనశాల…. టాలీవుడ్ లో అప్పట్లో బిగ్గెస్ట్ సెట్స్ లో భారీ ఎత్తున ప్లాన్ చేసిన విజువల్ వండర్ ఈ సినిమా. అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు ఇలా భారీ స్టార్ కాస్ట్ తో మొదలు పెట్టిన ఈ సినిమా ను కొంత భాగం….
షూటింగ్ కూడా చేశారు, కానీ సడెన్ గా సౌందర్య గారి మరణం వలన సినిమా మధ్యలోనే ఆగిపోయిందని సమాచారం. కానీ ఓవరాల్ గా సినిమా ఫూటేజ్ 17 నిమిషాల వరకు ఉండగా ఎప్పటి నుండో ఇండస్ట్రీ వాళ్ళు అభిమానులు ఆ ఫూటేజ్ ని రిలీజ్ చేస్తే… చూడాలని ఉందని…
కోరినప్పటికీ ఇప్పటి వరకు ఒప్పుకొని బాలయ్య ఎట్టకేలకు ఇప్పుడు ఈ ఫూటేజ్ ని రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు, ఈ నెల 24 న శ్రేయాస్ యాప్ లో పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ కాబోతున్న ఈ 17 నిమిషాల ఫూటేజ్ ని చూడాలి అంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
మరీ ఇతర సినిమాల మాదిరిగా ఎక్కువ రేటు పెట్టకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ఒక్కో టికెట్ రేటు 50 వరకు పెట్టారు. బుకింగ్స్ ని ఈ రోజు నుండి తీసుకుంటారని, సినిమా ట్రైలర్ ని 22 న రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. ఈ డబ్బు తో కొన్ని సేవా పనులను చేయాలనీ బాలయ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఈ విషయం తెలుసుకున్న కొందరు ఫ్యాన్స్…
టికెట్స్ ని కొని వేలం వేసి ఎక్కువ రేటు దక్కితే అవి డొనేట్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట… మొత్తం మీద కామన్ ఆడియన్స్ మాత్రం ఈ 17 నిమిషాల ఫూటేజ్ అప్పటి పరిస్థితులను బాలయ్య దర్శకత్వ ప్రతిభ సౌందర్య, శ్రీహరి గారిని చివరి సారి చూడొచ్చు అన్న ఆశతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.