Home న్యూస్ 10 సెకన్లకే రోమాలు నిక్కబోర్చుకున్నాయి…ఇక ఫ్యాన్స్ కి పూనకాలే!!

10 సెకన్లకే రోమాలు నిక్కబోర్చుకున్నాయి…ఇక ఫ్యాన్స్ కి పూనకాలే!!

991
0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ కి టైం వచ్చేసింది, ఫ్యాన్స్ సుమారు 2 ఏళ్ల గా ఎన్టీఆర్ సినిమాల అప్ డేట్స్ లేక ఆవురావురుమని ఎదురు చూస్తూ ఉండగా కొన్ని గంటల్లో ఆ ఆఖలి తీరబోతుందని చెప్పొచ్చు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ మెస్మరైజింగ్ యాక్షన్ తో ఎస్ ఎస్ రాజమౌళి అల్టిమేట్ టేకింగ్ కి కీరవాణి గూస్ బంప్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ యాడ్ అయ్యి రాబోతున్న ఈ టీసర్ ఎలా ఉండబోతుందో చిన్న గ్లిమ్స్ ని ఇప్పుడు రిలీజ్ చేసి చూపారు.

రామ్ చరణ్ రిలీజ్ చేసిన ఈ చిన్న గ్లిమ్స్ తోనే ఫ్యాన్స్ అల్టిమేట్ గూస్ బంప్స్ ని సొంతం చేసుకోగా టీసర్ ఏ రేంజ్ లో ఉంటుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు…గ్లిమ్స్ లో నీళ్ళలో నుండి బరిష తీస్తున్న ఎన్టీఆర్ చేయి పై నరాలు కనిపించడం చూస్తుంటే…

సినిమా కోసం ఎన్టీఆర్ బాడీ ఏ రేంజ్ లో బిల్డ్ చేసారో అర్ధం అవుతుంది, స్పెషల్ గా కట్ చేసిన ఈ ఇంట్రో టీసర్ ఆద్యంతం గూస్ బంప్స్ స్టఫ్ కచ్చితంగా ఉంటుందని ఈ 10 సెకన్ల వీడియో నిరూపించింది. మరి కొన్ని గంటల్లో రిలీజ్ కానున్న టీసర్ ఊహలకు మించి ఉంటుంది అని యూనిట్ చెబుతుండటంతో ఫ్యాన్స్…

రెట్టించిన జోష్ తో ఇప్పుడు టీసర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఫ్యాన్స్ కూడా టీసర్ రిలీజ్ అయిన తర్వాత యూట్యూబ్ లో రికార్డ్ ముక్క లేకుండా అన్ని బ్రేక్ చేయాలనీ ఫుల్ ప్రిపరేషన్ లో ఉన్నారు, మరి అవి ఏ రేంజ్ లో ఉంటాయో తెలియాలి అంటే మరోరోజు ఆగాల్సిందే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here