Home న్యూస్ ప్రభాస్ రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ 24 గంటల రికార్డ్ టార్గెట్లు ఇవే…!!

ప్రభాస్ రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ 24 గంటల రికార్డ్ టార్గెట్లు ఇవే…!!

556
0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూజ హెగ్డే ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లవ్ స్టొరీ రాధే శ్యామ్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ దసరా కి రిలీజ్ అవ్వాల్సింది, కానీ కరోనా వలన పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు వచ్చే ఇయర్ సమ్మర్ రేసులో నిలిచింది ఈ సినిమా. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు 23 న ఘనంగా…

జరగబోతున్న నేపధ్యంలో సినిమా టీసర్ ని రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ భావించినా కొంచం నిరాశ పరిచారు… కానీ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నాం అని అనౌన్స్ చేయడం తో ఇప్పుడు ఆ మోషన్ పోస్టర్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

ఇక ఈ మోషన్ పోస్టర్ కి మొదటి 24 గంటల్లో ఇప్పుడు కొన్ని టార్గెట్లు కూడా ఉన్నాయని చెప్పాలి. అవి బ్రేక్ చేయడమే ధ్యేయంగా ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు. మోషన్ పోస్టర్స్ పరంగా ప్రస్తుతం రికార్డ్ హోల్డర్ గా ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ ఉంది.

వ్యూస్ పరంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా లైక్స్ పరంగా తమిళ్ సినిమా విశ్వాసం మోషన్ పోస్టర్ టాప్ లో ఉందని చెప్పొచ్చు. ఒకసారి ఆ లిస్టు ను గమనిస్తే…
👉#RRRMotionPoster – 4.64M & 359K Likes(Telugu)**
👉#ViswasamMotionPoster – 3.7M & 377K Likes(Tamil)
👉#DarbarMotionPoster – 3.5M & 291K Likes (Tamil)
ఇవి ఓవరాల్ గా టాప్ టార్గెట్ లు గా చెప్పుకోవచ్చు… ఇక ఓన్లీ తెలుగు లో మాత్రమె చూసుకుంటే…

ఆర్ ఆర్ ఆర్ సినిమా కాకుండా సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ కి 2.5 మిలియన్ వ్యూస్ దక్కగా లైక్స్ పరంగా వకీల్ సాబ్ 1 లక్షా 94 వేల లైక్స్ తో ఉన్నాయి… మరి రాదే శ్యామ్ మోషన్ పోస్టర్ ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here