Home న్యూస్ బాలయ్య మాస్…ఒక్క లుక్ తో అంచనాలను పెంచేశాడుగా!!

బాలయ్య మాస్…ఒక్క లుక్ తో అంచనాలను పెంచేశాడుగా!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు, అఖండతో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య వీర సింహా రెడ్డి అంచనాలను అందుకునే రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకోక పోయినా కానీ అఖండ కలెక్షన్స్ ని క్రాస్ చేసి బాలయ్య కెరీర్ లో నంబర్ 1 షేర్ ని అందుకున్న సినిమాగా నిలిచి దుమ్ము లేపగా ఇప్పుడు బాలయ్య అపజయం తెలియని డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తూ ఉండగా…

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటూ ఉండగా బాలయ్యకి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా కూతురి రోల్ లో శ్రీలీల నటిస్తూ ఉండగా సినిమా ఈ ఇయర్ లోనే ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉండగా రీసెంట్ ఉగాది కానుకగా…

సినిమా లో బాలయ్య లుక్ ని రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ అంటూ రిలీజ్ చేసినా టైటిల్ ఏమి రివీల్ చేయలేదు. కానీ బాలయ్య లుక్స్ మాత్రం ఒక్క సారిగా సినిమా పై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది అని చెప్పాలి. బాలయ్య నిప్పురవ్వ టైం నాటి లుక్ ని…

గుర్తు చేస్తూ NBK108 ఫస్ట్ లుక్ ఉందని చెప్పాలి. 2 పోస్టర్స్ ను రిలీజ్ చేయగా రెండూ కూడా బాగా ఆకట్టుకోవడం విశేషం, దాంతో పాటు ‘దిస్ టైం బియోండ్ యువర్ ఇమాజినేషన్’ అంటూ టైటిల్ పై పెట్టడంతో అనిల్ రావిపూడి బాలయ్యని చాలా డిఫెరెంట్ గా చూపించబోతున్నట్లు తెలుస్తుంది. మరి సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here