Home గాసిప్స్ గజినీ లా మారోబోతున్న నిఖిల్…కానీ!!

గజినీ లా మారోబోతున్న నిఖిల్…కానీ!!

0

  టాలీవుడ్ యంగ్ హీరోల్లో డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో ఆడియన్స్ కి మంచి థ్రిల్ ఇచ్చే కథలను ఎంచుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్. హ్యాపీడేస్ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా నిలదొక్కుకోవడానికి కొంచం టైం తీసుకుని స్వామిరారా, కార్తికేయ లాంటి సినిమాలతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న నిఖిల్…. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా తో డీమానిటైజేషన్ టైం లో కూడా భారీ విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు.

తర్వాత వరుసగా జస్ట్ యావరేజ్ అనిపించే సినిమాలు చేసిన నిఖిల్ లాస్ట్ ఇయర్ అర్జున్ సువవరం తో మళ్ళీ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు కార్తికేయ సినిమా కి సీక్వెల్ చేస్తున్న నిఖిల్ ఈ సినిమా తో పాటు గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఓ సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే.

సుకుమార్ రైటింగ్స్ కో ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా కి కుమారి 21 ఎఫ్ ఫ్రేం సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో 18 పేజెస్ అనే కొత్త సినిమా మార్చ్ లో మొదలు పెట్టగా ఈ సినిమా కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది అన్నది రీసెంట్ గా రివీల్ అయింది. సూర్య నటించిన గజినీ…

తరహా లో ఇందులో కూడా హీరో కి మెమొరీ లాస్ ఉంటుందట… గజినీ లో 15 నిమిషాల కో సారి ఎఫెక్ట్ ఉంటుంది, అది సినిమా మొత్తం ఉండగా… ఇక్కడ మాత్రం సెకెండ్ ఆఫ్ లో మాత్రమె హీరో కి మెమొరీ లాస్ కాన్సెప్ట్ ఉంటుందని తెలియజేశారు. స్క్రీన్ ప్లే అద్బుతంగా ఉంటుందని అంటున్నారు.

త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమా తన కెరీర్ కి మరో టర్నింగ్ పాయింట్ అవ్వడం గ్యారెంటీ అన్న గట్ ఫీలింగ్ తో ఉన్నాడు నిఖిల్. ప్రస్తుతం చేస్తున్న కార్తికేయ 2 సినిమా కూడా అందరి అంచనాలను మించే విధంగా ఉంటుందని చెబుతున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న విషయం తెలిసిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here