లేడీ సూపర్ స్టార్ అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ నిశ్శబ్దం…. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇయర్ స్టార్టింగ్ లోనే రిలీజ్ అనుకున్నా కానీ అప్పటి నుండి పోస్ట్ పోన్ అవుతూ వచ్చి ఎట్టకేలకు సినిమా రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. కాగా సినిమా కి రిలీజ్ అయిన తర్వాత టాక్ అల్ట్రా డిసాస్టర్ అనిపించే రేంజ్ లో దక్కింది…
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే తీవ్ర నష్టాలతో అందరికీ షాక్ ఇచ్చేదని, ఇక్కడ డైరెక్ట్ రిలీజ్ అయ్యి సినిమా సేఫ్ అయ్యిందని అంతా భావించారు, ఇక సినిమా ఇక్కడ టాక్ ని ఏమాత్రం కేర్ చేయకుండా సెన్సేషనల్ వ్యూస్ సాధించిందని…
మొదటి వీక్ తర్వాత యూనిట్ కి అమెజాన్ ప్రైమ్ వెల్లడించగా…. ఇప్పుడు నెలాఖరుకు టైం కి 25 రోజుల డాటా ని యూనిట్ తో పంచుకున్నారట. మొత్తం మీద 25 రోజుల్లో సినిమా కి అల్టిమేట్ వ్యూస్ దక్కాయని, పెట్టిన రేటు కి ఈ రేంజ్ లో ఎక్స్ పెర్ట్ చేయలేదని ప్రైమ్ వాళ్ళకి చెప్పిందట…
ఆ లెక్కల ప్రకారం సినిమా అన్ని భాషల్లో కలిపి యూనిక్ వ్యూస్ కింద 1.45 మిలియన్ వ్యూస్ ని 25 రోజుల్లో సాధించిందట ఇండియా మొత్తం మీద… ఇది నిజంగానే సెన్సేషనల్ వ్యూస్ కౌంట్ గా చెప్పుకోవాలని… అమెజాన్ ప్రైమ్ 23 కోట్లు పెట్టి కొన్న ఈ సినిమా వాళ్ళకి సాలిడ్ గా కలెక్షన్స్ ని జనరేట్ చేసి ఉండొచ్చు అని అంచనా…
ఒకసారి కలెక్షన్స్ లెక్కలలోకి మార్చితే….అమెజాన్ ప్రైమ్ 1 నెల రేటు 129 టికెట్ రేటు అనుకుంటే… 1.45 మిలియన్ యూనిక్ వ్యూస్ కి 18.70 కోట్ల దాకా రెవెన్యూ ని సినిమా సొంతం చేసుకుని ఉండొచ్చని అంచనా వేయవచ్చు. అంటే సినిమా మరో నెలలో అమెజాన్ ప్రైమ్ కి లాభాలు కూడా తెచ్చి పెట్టడం ఖాయమని భావించాలి.