Home గాసిప్స్ సినిమా డిసాస్టరే….కానీ 21.20 కోట్లు ఏంటి సామి!!

సినిమా డిసాస్టరే….కానీ 21.20 కోట్లు ఏంటి సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్ నటించిన రీసెంట్ మూవీ మాచర్ల నియోజకవర్గం సినిమా మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా టోటల్ రన్ లో సినిమా 10.24 కోట్లు మాత్రమే రికవరీ చేయగా టోటల్ గా 11.76 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుంది…

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ డిసాస్టర్ గా నిలిచిన సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా మాత్రం మంచి రేట్లనే సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం. సినిమా కి డిజిటల్ రైట్స్ కింద 6.5 కోట్ల రేటు సొంతం అవ్వగా…..

శాటిలైట్ రైట్స్ కింద 6 కోట్ల రేటు సొంతం అవ్వగా హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ కింద 8 కోట్ల దాకా రేటు ని సినిమా సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక మ్యూజిక్ రైట్స్ కింద ఆల్ మోస్ట్ 70 లక్షల దాకా రేటుని సొంతం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద నాన్ థియేట్రికల్ రైట్స్ కింద సినిమా…

టోటల్ గా 21.20 కోట్లు రికవరీ చేసింది. అంటే బాక్స్ ఆఫీస్ రిజల్ట్ కి ఆల్ మోస్ట్ డబుల్ రేటులో నాన్ థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా థియేట్రికల్ రన్ లో మాత్రం భారీ నష్టాలను సొంతం చేసుకుని నిరాశ పరిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here