Home న్యూస్ నితిన్ రాబిన్ హుడ్ నైజాం బిజినెస్….ఫ్లాఫ్స్ లో కూడా నితిన్ మాస్ రచ్చ!!

నితిన్ రాబిన్ హుడ్ నైజాం బిజినెస్….ఫ్లాఫ్స్ లో కూడా నితిన్ మాస్ రచ్చ!!

0

బాక్స్ అఫీస్ దగ్గర భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు హిట్ ను సొంతం చేసుకోలేక పోయిన యూత్ స్టార్ నితిన్(Nithiin) నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) డీసెంట్ అంచనాల నడుమ ఈ మంత్ ఎండ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా….

ఆల్ రెడీ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా బాగానే ఆకట్టుకుంది…ఇక సినిమా కన్నా ముందు వరకు వరుస ఫ్లాఫ్స్ లో నితిన్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా ఈ సినిమా బిజినెస్ పరంగా మాత్రం బాగానే కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం.

తెలుగు రాష్ట్రాల మేజర్ సెంటర్స్ లో మంచి బిజినెస్ ను సొంతం చేసుకుంటూ నితిన్ ఫ్లాఫ్ స్ట్రీక్ ఇంపాక్ట్ అయితే కనిపించకుండా దూసుకు పోతూ ఉండటం విశేషం కాగా…లేటెస్ట్ గా సినిమా నైజాం ఏరియా వాల్యూ బిజినెస్ కంప్లీట్ అయ్యింది… ఓవరాల్ గా మంచి రేటునే…

సినిమా సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద 10.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను నైజాం ఏరియాలో రాబిన్ హుడ్ మూవీ సొంతం చేసుకోగా వరుస ఫ్లాఫ్స్ ఇంపాక్ట్ ఉన్నా కూడా ఓవరాల్ గా సాలిడ్ వాల్యూ రేటు నే ఇక్కడ నుండి సొంతం చేసుకుంది…

ఇక సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి మరింత బజ్ ను క్రియేట్ చేస్తే సమ్మర్ పోటి ఉన్నప్పటికీ కూడా రాబిన్ హుడ్ మూవీ కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన ఏరియాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here