కెరీర్ లో అల్టిమేట్ క్రేజ్ ఉన్నా నైజాం ఏరియాలో మిగిలిన హీరోలు ఒకరి తర్వాత ఒకరు 20 కోట్ల మార్క్ మూవీస్ తో దూసుకుపోతున్నా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మాత్రం ఆ అవకాశం దక్కలేదు. జనతా గ్యారేజ్ ఇక్కడ ఆ మార్క్ ని అందుకోవడానికి చాలా క్లోజ్ గా వచ్చినా 19.5 కోట్ల రేంజ్ షేర్ తో ఆ మార్క్ ని అందుకోలేదు. తర్వాత వచ్చిన జైలవకుశ కూడా ఈ మార్క్ ని అందుకోలేదు.
ఈ క్రమంలో ఇతర సినిమాలు 20 కోట్లు అందుకుంటూ దూసుకుపోతున్న సమయంలో ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ లో కలెక్షన్స్ సెంసేషన్ ని క్రియేట్ చేస్తూ నైజాం ఏరియాలో కేవలం 11 రోజుల కె 20 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది.
అంటే కాకుండా బాహుబలి కాకుండా ఫాస్టెస్ట్ 20 కోట్ల షేర్ ని నైజాంలో అందుకున్న సినిమాగా నిలిచిన ఈ సినిమా మరో అరుదైన రికార్డ్ ను కూడా సొంతం చేసుకుంది, మరి ఇప్పుడు లాంగ్ రన్ లో సినిమా ఎంత దూరం వెళుతుంది అనేది అందరిలోనూ ఆసక్తి రేపుతున్న ప్రశ్న అని చెప్పాలి.