తెలుగు సినిమా చరిత్రలోనే తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ నెలకొల్పుతున్న కలెక్షన్స్ రికార్డ్ ఊహకందని ఊచకోత అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ రోజూ కొత్త రికార్డ్ ను నమోదు చేస్తూ దూసుకు పోతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రీవియస్ డే రికార్డులను బ్రేక్ చేస్తూ కొత్త బెంచ్ మార్క్ లను సెట్ చేస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…
6 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఒక్క నైజాం ఏరియాలోనే ఏకంగా 70 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని అందుకుని ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేయబోతుంది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతీ రోజూ సెన్సేషనల్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా నైజాం ఏరియాలో ఆల్ రెడీ టికెట్ హైక్స్ మరీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా జోరు ఏమాత్రం తగ్గించకుండా పరుగును కొనసాగించిన సినిమా ఇప్పుడు ఇక్కడ ఏకంగా ఇది వరకు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన బాహుబలి 2 మూవీ ఫైనల్ రన్ కలెక్షన్స్ ని….
బ్రేక్ చేసి 5 రోజుల్లో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది, బాహుబలి 2 మూవీ టోటల్ రన్ లో ఇక్కడ 68 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు GST రిటర్న్స్ యాడ్ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 5 రోజుల్లో ఈ కలెక్షన్స్ ని అందుకోగా 6 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో…. వితౌట్ GST రిటర్న్స్ యాడ్ చేయకుండానే ఓవరాల్ గా బ్రేక్ చేసింది…
మొత్తం మీద ఇప్పుడు నైజాం గడ్డ మీద మొట్ట మొదటి సారిగా 70 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకున్న మొదటి సినిమాగా చారిత్రిక రికార్డ్ ను నమోదు చేసింది ఆర్ ఆర్ ఆర్ మూవీ… లాంగ్ రన్ లో ఇదే జోరు చూపిస్తే ఒక్క నైజాం ఏరియాలోనే 100 కోట్ల షేర్ ని అందుకున్న మొదటి సినిమాగా ఆర్ ఆర్ ఆర్ సరికొత్త బెంచ్ మార్క్ ని నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.