బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 15 వీకెండ్ లో మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie) ఫస్ట్ ఆటకే డిసాస్టర్ రిపోర్ట్ లను సొంతం చేసుకోగా, ఏ దశలో కూడా తర్వాత తేరుకోలేక పోయిన సినిమా మొదటి వారానికే ఆల్ మోస్ట్ రన్ ని…
కంప్లీట్ చేసుకుని ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది….సినిమా కి నైజాం ఏరియాలో అంచనాలను మించి నష్టాలు సొంతం అయ్యాయి. రిలీజ్ కి ముందు నైజాంలో 15 కోట్ల దాకా బిజినెస్ జరిగింది, కానీ అందులో 2.5 కోట్ల దాకా రిటర్న్ అమౌంట్ గా డీల్ చేసుకున్నట్లు ట్రేడ్ సమాచారం…
కానీ రిలీజ్ టైం లో ఉన్న పోటి వలన ఓవరాల్ గా బిజినెస్ 11.50 కోట్ల దాకా మారగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొదటి రోజు నుండే ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోవడంతో సినిమా తేరుకోలేక పోయింది. మొత్తం మీద మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కే…
ఆల్ మోస్ట్ రన్ ని కంప్లీట్ చేసుకున్న మిస్టర్ బచ్చన్ నైజాం ఏరియాలో 3.05 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని రన్ ని కంప్లీట్ చేసుకోగా ఓవరాల్ గా రిటర్నబుల్ అమౌంట్ కాకుండా ఓవరాల్ గా బిజినెస్ లో ఇప్పుడు ఏకంగా 8.45 కోట్ల రేంజ్ లో లాస్ ను ఇక్కడ సొంతం చేసుకుంది.
మిగిలిన ఏరియాల్లో కూడా హెవీగానే లాసులు వచ్చినా కూడా ఈ ఏరియాలో మాత్రం అనుకున్న దాని కన్నా కూడా భారీ గా లాస్ ను సొంతం చేసుకున్న మిస్టర్ బచ్చన్ రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బిగ్ లాస్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది అని చెప్పొచ్చు.