కొన్ని కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు వాటిని ఆడియన్స్ పెద్దగా ఆదరించారు కానీ, అదే కొంత కాలం తర్వాత సినిమాను టెలివిజన్ లో చూసినా లేక వేరే డిజిటల్ ఫార్మాట్ లో చూసినప్పుడు మాత్రం ఈ సినిమాను ఆ టైం లో ఎలా మిస్ అయ్యాం, ఈ సినిమా ఎందుకని ఫ్లాఫ్ అయింది అంటూ అనుకుంటాం చాలాసార్లు. అలా చాల సార్లు కొన్ని మంచి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయినవి ఉన్నాయి.
కొన్ని కొత్త తరహా కథలు కూడా ఇలా రిలీజ్ అయినప్పుడు అంచనాలను అందుకోలేక తర్వాత మాత్రం మంచి సినిమా ఎందుకు ఆడలేదో అనిపించుకున్న సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ కోవలోనే వచ్చే సినిమాల్లో 2020 న్యూ ఇయర్ కి వచ్చిన కన్నడ డబ్ మూవీ ఒకటి ఉంది..
ఆ సినిమానే అతడే శ్రీమన్నారాయణ సినిమా…కంప్లీట్ గా డిఫెరెంట్ కాన్సెప్ట్ తో KGF రేంజ్ భారీ విజువల్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ను కన్నడతో పాటు సౌత్ లో డబ్ చేసి రిలీజ్ చేశారు. న్యూ ఇయర్ కి రిలీజ్ అయిన ఈ సినిమాను తెలుగు లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
కానీ చూసిన వాళ్ళు బాగుంది ఒక డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ అని టాక్ స్ప్రెడ్ చేసే లోపే సంక్రాంతి సినిమాల రాకతో ఈ సినిమా పరుగు పూర్తీ అయింది. దాంతో సినిమాను అందరూ మర్చుపోయారు, కాగా రిలీజ్ అయిన ఏడాది తర్వాత ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రిలీజ్ తెలుగు లో ఆహా యాప్ లో రీసెంట్ గా జరగింది, దాంతో సినిమా చూసిన వాళ్ళు అందరూ కూడా సోషల్ మీడియా లో…
ఇలాంటి డిఫెరెంట్ మూవీ ని, హై క్వాలిటీ మూవీ ని ఆ టైం లో ఎలా మిస్ అయ్యాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా లెంత్ కొంచం ఎక్కువ అయినా కాన్సెప్ట్ అండ్ టేకింగ్ కోసం ఈజీగా ఒకసారి చూడొచ్చు అంటూ చెబుతున్నారు. దాంతో ఆహా యాప్ లో ఇప్పుడు సినిమాకి మంచి వ్యూస్ వస్తున్నట్లు సమాచారం. రిలీజ్ టైం లో ఎవ్వరూ పట్టించుకోకున్నా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా కి మంచి టాక్ లభిస్తుంది అని చెప్పాలి.