Home న్యూస్ పెద్ద సినిమాలకు మైండ్ బ్లాంక్ దెబ్బ కొట్టిన ఆంధ్ర ప్రభుత్వం!!

పెద్ద సినిమాలకు మైండ్ బ్లాంక్ దెబ్బ కొట్టిన ఆంధ్ర ప్రభుత్వం!!

0

టాలీవుడ్ పై మైండ్ బ్లాంక్ అయ్యే నిర్ణయం తీసుకుంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం… రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సినిమా ల టికెట్ రేట్లు షోల పై మైండ్ బ్లాంక్ అయ్యే నిర్ణయం తీసుకుంది. ఇక మీదట చిన్న పెద్ద అన్న తేడా లేకుండా నార్మల్ టికెట్ రేట్లతోనే సినిమాలు నడపాల్సి ఉంటుందని, ఏ సినిమా కి కూడా బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు లాంటివి ఉండవని… సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లేక్స్…

అని తేడా లేకుండా అన్ని థియేటర్స్ లో రోజుకు 4 షోలు మాత్రమే వేయాల్సి ఉంటుందని, పేద, మధ్య తరగతి ప్రజలకు వినోదం సినిమా కాబట్టి.. వారి బలహీనతలు సొమ్ము చేసుకోకుండా ప్రభుత్వం కాపాడుతుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అనేక సార్లు చర్చలు జరిగిపిన పెద్దలతో బయటికి ఓపెన్ గా చెప్పకున్నా…

మీరు రేట్లు ఎలా పెట్టుకుంటారో మీ ఇష్టం మేం మధ్యలో జోక్యం చేసుకొం అన్నట్లు అన్నా ఇప్పుడు కంప్లీట్ గా అలాంటిదేమీ ఉండదని చెప్పారు. ఈ దెబ్బతో డిసెంబర్ నుండి సంక్రాంతి వరకు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న అఖండ, పుష్ప, ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ మరియు భీమ్లా నాయక్ లాంటి సినిమాల మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here