Home టోటల్ కలెక్షన్స్ 25.5 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది!

25.5 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది!

0

  విజయ్ దేవరకొండ హీరోగా గీత గోవిందం లాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన సినిమా నోటా… రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి వారం మొత్తం మీద తెలుగు వర్షన్ కి గాను 9.8 కోట్ల షేర్ ని తమిళ్ వర్షన్ కి గాను 3.6 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా మొదటి వారం 13.4 కోట్ల దాకా షేర్ ని సాధించిన ఈ సినిమా ఆల్ మోస్ట్ పరుగును అప్పుడే ఆపేసింది.

మిగిలిన రన్ లో సినిమా తెలుగు లో మొత్తం మీద మరో 20 లక్షల దాకా షేర్ ని తమిళ్ వర్షన్ మరో 40 లక్షల దాకా షేర్ ని సాధించినట్లు సమాచారం. దాంతో సినిమా తెలుగు వర్షన్ మొత్తం మీద 10 కోట్ల షేర్ ని అందుకోగా తమిళ్ వర్షన్ టోటల్ గా..

4 కోట్ల షేర్ దాకా వసూల్ చేసింది. కాగా సినిమా సినిమాను తెలుగు మరియు తమిళ్ వర్షన్స్ రెండు కలిపి 24.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాధించగా 25.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫైనల్ గా సినిమా 14 కోట్ల షేర్ ని సాధించి సుమారు 11 కోట్లకు పైగా నష్టాన్ని మిగిలించి భారీ ఫ్లాఫ్ గా మిగిలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here