Home గాసిప్స్ ఎన్టీఆర్ 30….. సెన్సేషనల్ అప్ డేట్!!

ఎన్టీఆర్ 30….. సెన్సేషనల్ అప్ డేట్!!

0

    టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమ జోరు మీదున్నాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర గత ఐదు సినిమాలుగా ఒక్కటంటే ఒక్క అపజయం లేకుండా కెరీర్ ని కొనసాగిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి జక్కన్న డైరెక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా పై అంచనాలు స్కై హై అనిపించే లెవల్ లో ఉండగా ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని అభిమానులతో పాటు టోటల్ ఆడియన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అప్ కమింగ్ మూవీ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు ఇండస్ట్రీ లో ఈ సినిమా పై ఓకే…

కన్ఫాం న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది, ఆ న్యూస్ ప్రకారం ఈ సినిమా భారీ లెవల్ లో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుందని సమాచారం. ఆర్.ఆర్.ఆర్ ఇంట్రో టీసర్ 1 లో తన వాయిస్ ఓవర్ తో అద్బుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్.

అందువలనే ఎన్టీఆర్30 సినిమా ను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించడానికి కథ లో కొన్ని మార్పులు చేర్పులు చేశాడట త్రివిక్రమ్, ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా అప్ డేట్ అఫీషియల్ గా వచ్చే అవకాశం ఉందని సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here