Home గాసిప్స్ షాకింగ్: ఎన్టీఆర్30….అస్సలు టచ్ లేని 2 కథలు!

షాకింగ్: ఎన్టీఆర్30….అస్సలు టచ్ లేని 2 కథలు!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాకే పరిమితం అవ్వగా తన అప్ కమింగ్ సినిమాలు అన్నీ కరోనా ఎఫెక్ట్ తో వరుస పెట్టి పోస్ట్ పోనులు అవుతూ పోతున్నాయి. అందులో త్రివిక్రమ్ తో చేసే సినిమా కూడా ఉంది, ఈ పాటికే మొదలు అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్ కి మొదలు కాబోతుందని సమాచారం, కాగా ఈ సినిమా స్టొరీ పాయింట్ పై ఇండస్ట్రీలో…..

2 డిఫెరెంట్ కథలు ప్రచారంలో ఉన్నాయి అవి ఏంటంటే… ముందుగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ కి ఓ డిఫెరెంట్ స్టొరీ లైన్ ని వినిపించారట. ఆర్కియాలజీ నేపధ్యంలో కనిపించకుండా పోయిన పురావస్తు వస్తువలను కనిపెట్టే హీరో… ఆర్కియాలజీ అలాగే హస్తినకి లింక్ ఉన్న కథ అని అంటున్నారు.

అందుకే ఈ కథకి “అయినను పోయి రావలె హస్తినకు” అనే టైటిల్ ని పెట్టారని టాక్ ఉంది, ఇక మరో కథ పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్, ఓ బిజినెస్ మ్యాన్ అనుకోకుండా పొలిటికల్ లీడర్ అయితే ఎలా ఉంటుంది అన్నది ఓవరాల్ గా సినిమా స్టొరీ పాయింట్ అని అంటున్నారు.

ఈ రెండు కథలు వేటికవే పూర్తీ విరుద్దమైన కథలు కాగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ కి రెండు కథలను వినిపించారని, ఎన్టీఆర్ ఏ కథని ఎంచుకొబోతున్నారు అన్నది ఇంకా కన్ఫాం కాలేదని టాక్ ఉంది, త్వరలోనే ఫైనల్ గా డెసిషన్ ని తీసుకోవచ్చని అంటున్నారు. రెండు కథల్లో పాన్ ఇండియా రేంజ్ అప్పీల్ మాత్రం మొదటి కథకే ఉందని చెప్పాలి.

పూర్తిగా ఇప్పటి వరకు రాని డిఫెరెంట్ స్టొరీ లైన్ తో ఉన్న ఈ కథ పాయింట్ పెర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తే భారీ లెవల్ లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది… మరి ఈ రెండు కథల్లో ఎంతవరకు నిజం ఉంది, ఎన్టీఆర్ చివరగా ఎ కథని ఎంచుకుంటాడు అన్న వివరాలు త్వరలోనే బయటికి రావొచ్చని అంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here