Home న్యూస్ చరిత్రలో అరవింద సమేత..బాహుబలి తర్వాత ఈ సినిమానే!

చరిత్రలో అరవింద సమేత..బాహుబలి తర్వాత ఈ సినిమానే!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అప్ కమింగ్ సెన్సేషనల్ మూవీ అరవింద సమేత వీర రాఘవ పై నెలకొన్న అంచనాలు ఎలాంటివో అందరికీ తెలిసితే. అత్యంత భారీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా సినిమా బిజినెస్ ఇప్పటికే జోరు అందుకోగా శాటిలైట్ రైట్స్ విషయంలో చరిత్రలో చోటు దక్కించుకుంది ఈ సినిమా. తెలుగు లో బాహుబలి తర్వాత నాన్ బాహుబలి రేంజ్ లో చుక్కలు చూపే రేంజ్ లో బిజినెస్ ని దక్కించుకుంది అరవింద సమేత సినిమా.

బాహుబలి పార్ట్ 2 కి 26.5 కోట్ల శాటిలైట్ రైట్స్ తెలుగు లో దక్కగా నాన్ బాహుబలి రికార్డ్ రేంజ్ లో అరవింద సమేతకి 23 కోట్లకు పైగా రైట్స్ దక్కినట్లు సమాచారం…జీతెలుగు వారు ఈ హక్కులను దక్కించుకున్నారట. దాంతో టాలీవుడ్ లో ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డ్ ను అందుకుని అరవింద సమేత సినిమా సంచలనం సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here