Home న్యూస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖాతాలో మరో రికార్డ్…100000తో ఫస్ట్ రికార్డ్ కొట్టిన ఘనత!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖాతాలో మరో రికార్డ్…100000తో ఫస్ట్ రికార్డ్ కొట్టిన ఘనత!

0

సోషల్ మీడియా లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సరికొత్త రికార్డ్ తో దుమ్ము దుమారం చేశారు, టాలీవుడ్ మూవీస్ పరంగా ఇప్పటి వరకు ఏ సినిమా కి దక్కని రికార్డ్ ను సొంతం చేసుకుని రచ్చ చేశారు. సోషల్ మీడియా లో ఎన్టీఆర్ లాస్ట్ మూవీస్ అన్నింటి తోనూ సంచలనాలు సృష్టించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ గత మూడేళ్ళుగా పెద్దగా సంచలనాలు సృష్టించడానికి తక్కువ అవకాశాలే లభించాయి. ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి….

ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం మూడేళ్ళుగా టైం కేటాయించడంతో ఫ్యాన్స్ ఈ సినిమా అప్ డేట్స్ కోసమే ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తుంది తప్పితే కొత్త సినిమాల గురించి ఆలోచించడానికి ఇంకా టైం పట్టేలా ఉండటం తో ఆర్ ఆర్ ఆర్ మీదే ఫోకస్ పెట్టారు ఫ్యాన్స్..

లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ లోని ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ తో సంచలన రికార్డులను నమోదు చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా ఎన్టీఆర్ పుట్టిన రోజు టైం లో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ న్యూ లుక్ ని రిలీజ్ చేయగా…

ఆ పోస్టర్ కి ట్విట్టర్ లో రికార్డ్ లెవల్ లో కామెంట్స్ రావడం జరిగింది, దాంతో సంచలన రికార్డులను నమోదు చేస్తూ ఫస్ట్ లుక్స్ పరంగా ఫాస్టెస్ట్ ఒక లక్ష కామెంట్స్ ను సొంతం చేసుకున్న క్యారెక్టర్ ఫస్ట్ లుక్ గా ఎన్టీఆర్ కొమరం భీమ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనం సృష్టించింది. మొత్తం మీద 24 గంటల్లో…

అత్యధిక రీట్వీట్స్ మరియు లైక్స్ విషయంలో సర్కారు వారి పాట ప్రీ లుక్ రికార్డ్ కొట్టక పోయినా కానీ టాలీవుడ్ తరుపున ఫాస్టెస్ట్ 1 లక్ష కామెంట్స్ రికార్డ్ ను సొంతం చేసుకుని సంచలన రికార్డ్ కొట్టారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇది వరకు వచ్చిన అల్లు అర్జున్ పుష్ప ఫస్ట్ 1 లక్ష కామెంట్స్ రికార్డ్ ను అందుకుంది…ఇప్పుడు ఆ రికార్డ్ ను ఈ లుక్ బ్రేక్ చేసింది…ఇక సినిమా ప్రస్తుతానికి ఇంకా అక్టోబర్ 13 నే ఆడియన్స్ ముందుకు రాబోతుందని అంటున్నారు. మరి వచ్చాక రచ్చ ఇంకా ఏ లెవల్ లో ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here