Home గాసిప్స్ తమిళ్ తెలుగు లో బ్లాక్ బస్టర్ హిట్…7 వరుస హిట్లు…2 ఫ్లాఫ్స్ కొట్టిన హీరో హిందీ...

తమిళ్ తెలుగు లో బ్లాక్ బస్టర్ హిట్…7 వరుస హిట్లు…2 ఫ్లాఫ్స్ కొట్టిన హీరో హిందీ రీమేక్!

0

రీసెంట్ టైం లో బాలీవుడ్ లో సౌత్ రీమేక్ లు మరీ ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే, టెంపర్, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు అక్కడ రీమేక్ అయ్యి భారీ విజయాలను సొంతం చేసుకోవడం తో ఛత్రపతి, జెర్సీ, అల వైకుంఠ పురంలో, సూరరై పొట్రు లాంటి సెన్సేషనల్ మూవీస్ రీమేక్ లకు రంగం సిద్ధం చేస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు. ఈ క్రమం లో మరిన్ని సౌత్ రీమేక్ లు అక్కడ ఒక్కోటి గా కన్ఫాం అవుతుండగా ఇప్పుడు మరో క్రేజీ సినిమా అక్కడ…

రీమేక్ కి సిద్ధం అవుతుంది. ముందుగా తమిళ్ లో రూపొంది అక్కడ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి తర్వాత తెలుగు లో రీమేక్ అయ్యి ఇక్కడ కూడా స్లో గా స్టార్ట్ అయ్యి లాంగ్ రన్ ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ…

రాక్షసుడు సినిమా ఇప్పుడు అక్కడ రీమేక్ కి సిద్ధం అవుతుంది. కాగా ఈ సినిమా అక్కడ లేటెస్ట్ సెన్సేషన్…. వరుసగా 7 హిట్లు మరియు 2 బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ కొట్టిన సెన్సేషనల్ స్టార్ ఆయుష్ మాన్ ఖురానా రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. దాంతో బాలీవుడ్ మొత్తం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సౌత్ లోనే కాదు రీసెంట్ టైం లో ఇండియా లో రూపొందిన ది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్స్ లో ముందు నిలిచే సినిమా రాక్షసుడు… టైట్ స్క్రీన్ ప్లే సాగే ఈ సినిమా అక్కడ కూడా ఆకట్టుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. వేటికవే డిఫెరెంట్ మూవీస్ ని ఎంచుకుంటూ 7 వరుస హిట్లు కొట్టిన ఆయుష్మాన్ ఖురానా ఈ ఇయర్ శుబ్ మంగళ్ జ్యాదా సావ్దాన్ మరియు OTT రిలీజ్ గులాబో సితాబో సినిమాలతో ఫ్లాఫ్స్ ని సొంతం చేసుకున్నాడు.

అయినా కానీ వరుస ఆఫర్స్ తో దూసుకు పోతున్న ఆయుష్మాన్ ఖురానా బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమా ను ముందు మొదలు పెట్టి వచ్చే ఇయర్ ఆడియన్స్ ముందుకు తేవాలి అని ప్లానింగ్ లో ఉన్నాడట. మరి ఈ సినిమాతో ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here