Home న్యూస్ టికెట్లు పంచినా…ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే!

టికెట్లు పంచినా…ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే!

0

     నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ మహానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అతి కష్టం మీద మొదటి వారాన్ని ముగించుకుంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి పార్ట్ మిగిలించిన 50.1 కోట్ల నష్టాన్ని పూడ్చడానికి బాక్స్ ఆఫీస్ బరిలో నిలిచినా కానీ పార్వాలేదు ఒకసారి చూడొచ్చు అన్న టాక్ సొంతం చేసుకున్నా కానీ అనుకున్న రేంజ్ లో ఓపెన్ కాలేక పోయిన ఈ సినిమా.

మొత్తం మీద మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేయగా మొత్తంగా మొదటి వీకెండ్ లో 3 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా తర్వాత 4 రోజుల్లో కేవలం 60 లక్షల రేంజ్ లోనే షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. సినిమా సాధించిన రోజు వారి కలెక్షన్స్ ని…

ఒకసారి గమనిస్తే… Day 1 – 2.12 cr, Day 2 – 60 L, Day 3 – 30 L, Day 4 – 20 L , Day 5 – 14 L , Day 6 – 11 L , Day 7 – 8 L ఇదీ ఓవరాల్ గా సినిమా కలెక్షన్స్ ల పరిస్థితి..మొత్తం మీద సినిమా 3.6 కోట్ల లోపు షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోగా…

సినిమా టార్గెట్ గా చెప్పుకున్న 51 కోట్ల టార్గెట్ ని అందుకోవడానికి సినిమా మరో 47 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, సినిమా కి వర్కింగ్ డేస్ లో టికెట్లు పార్టీ తరుపున ఫ్రీ గా పంచినా అవి కలెక్షన్స్ రూపం లో మాత్రం మారలేదు. కొందరు సినిమా టికెట్స్ ని సగం రేటు కే ఇచ్చినా కానీ జనాల్లో సినిమా పై

ఇసుమంత కూడా ఆసక్తి లేకపోవడం తో తెలుగు సినిమా చరిత్ర లోనే బిగ్గెస్ట్ డిసాస్టర్ గా ఈ సినిమా నిలిచింది అని చెప్పాలి. ఇక ఫైనల్ రన్ లో 4 కోట్ల లోపు కలెక్షన్స్ తో పరుగును ఆపడం ఖాయం… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here