నట సింహం బాలయ్య నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్ కి అతీతంగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే, రీసెంట్ గా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ విషయం లో మాత్రం కొంచం ఎదురుదెబ్బ తగిలింది, కారణాలు ఏవైనా మొదటి రోజు అనుకున్న రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవడం లో మాత్రం ఎన్టీఆర్ కథానాయకుడు విఫలం అయ్యింది అని చెప్పాలి.
ఇక ఇప్పుడు రెండో పార్ట్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా సినిమా కి అడ్వాన్స్ బుకింగ్స్ 5 రోజుల ముందు నుండే మొదలు అవ్వగా ఇప్పటి వరకు వచ్చిన రెస్పాన్స్ బుక్ అవుతున్న టికెట్ సేల్స్ ని చూస్తె మాత్రం దిమ్మ తిరిగే షాక్ తగిలినట్లే అని చెప్పాలి.
అన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు ఏమాత్రం లేక పోవడం అందరికీ షాక్ ఇస్తుంది, బాలయ్య రొటీన్ మాస్ మూవీస్ కి కూడా చాలా బెటర్ గా 30% కి పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు అందుకోగా ప్రస్తుతం ఎన్టీఆర్ మహానాయకుడు కి మాత్రం కేవలం 10% లోపే బుకింగ్స్ ఉండటం విచారకరం.
ఇక మొదటి షో సమయానికి అత్యంత భారీ గ్రోత్ ని సాధించక పొతే మాత్రం మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఈ సినిమా భారీ షాక్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ని బట్టి చూస్తె మాత్రం మొదటి రోజు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా.
బాక్స్ ఆఫీస్ దగ్గర 2 నుండి 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఇది రీసెంట్ టైం బాలయ్య కెరీర్ లో లోవెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచే అవకాశం ఉంది, మరి ఆ మహా అద్బుతం తొలి రోజు సమయానికి జరిగుతుందో లేదో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.