క్రిష్ మరియు బాలయ్య ల కాంబినేషన్ లో గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత తెరకెక్కిన ఎన్టీఆర్ బయో పిక్ లోని మొదటి పార్ట్ రిలీజ్ తర్వాత జరిగిన పరిణామాల తర్వాత ఇప్పుడు రెండో పార్ట్ పై అందరి లోను రిజల్ట్ ఎలా ఉంటుంది అన్న ఉత్కంట మొదలు అయింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబో తున్న ఈ సినిమా ఓవరాల్ గా భారీ వసూళ్ళ ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
ఇక రెండో పార్ట్ ఓవరాల్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ బయటికి వచ్చేసింది, ఆ లెక్క ప్రకారం సినిమా ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో బాగానే రిలీజ్ అవుతుంది, నైజాం లో 240 వరకు థియేటర్స్ లో, ఆంధ్రా మరియు సీడెడ్ లలో కలిపి టోటల్ గా…
400 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మొత్తంగా రెండు రాష్ట్రాలలో 650 వరకు థియేటర్స్ లో ఫైనల్ గా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, ఇక సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో మొత్తం మీద 150 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
దాంతో ఇండియా లో సినిమా 800 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా ఓవర్సీస్ మొత్తం మీద సినిమా సుమారు 120 వరకు లోకేషన్స్ లో రిలీజ్ కాబోతుంది. దాంతో వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా సుమారు 920 వరకు థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది.
దాంతో అన్ సీజన్ లో కూడా మంచి రిలీజ్ నే సినిమా సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫేట్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తి గా మారింది అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా బుకింగ్స్ వివరాలు ఎలా ఉన్నాయో మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.