Home న్యూస్ షాకింగ్ న్యూస్: పార్ట్ 1(240)…పార్ట్ 2(120)

షాకింగ్ న్యూస్: పార్ట్ 1(240)…పార్ట్ 2(120)

359
0

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి పార్ట్ సంక్రాంతి బరిలో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోలేక పోయిన విషయం తెలిసిందే. కాగా సినిమా రిలీజ్ రోజున ఎలాంటి పోటి లేకుండా భారీ ఎత్తున సోలో గా రిలీజ్ అయినా కానీ కలెక్షన్స్ కూడా అనుకున్న రేంజ్ లో అందుకోలేదు. ముఖ్యంగా పాజిటివ్ టాక్ మూవీస్ కి ఆదరణ ఎక్కువ ఉండే ఓవర్సీస్ లో కూడా…

సినిమా కి అనుకున్న లెవల్ కలెక్షన్స్ రాలేదు. కానీ మొదటి పార్ట్ అక్కడ బాలయ్య కెరీర్ లో రికార్డ్ లెవల్ లో ఏకంగా 240 లోకేషన్స్ లో రిలీజ్ ని సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు రెండో పార్ట్ అక్కడ రిలీజ్ అవుతున్న తీరు కొద్దిగా షాక్ ని కలిగిస్తుంది అని చెప్పాలి.

అక్కడ మొత్తం మీద రెండో పార్ట్ కి ఇప్పటి వరకు కన్ఫాం అయిన లోకేషన్స్ కౌంట్ కేవలం 120 మాత్రమె. ఎలాంటి పోటి లేకుండా రిలీజ్ కాబోతున్న రెండో పార్ట్ కి అక్కడ భారీ లోకేషన్స్ రిలీజ్ చేసుకునే చాన్స్ ఉన్నా కానీ బయ్యర్లు సాహసించడం లేదట.

ఒకవేళ సినిమా రిజల్ట్ పాజిటివ్ గా ఉంటెనే సినిమా రిలీజ్ లోకేషన్స్ ని క్రమంగా పెంచాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా పై ఇక్కడ ఎలాంటి ప్రెజర్ ఉందొ ఓవర్సీస్ లో కూడా అలంటి ప్రెజర్ ఉందని చెప్పాలి. మొదటి పార్ట్ నష్టాలతో…

రెండో పార్ట్ అక్కడ కూడా భారీ వసూళ్ళ ని రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఈ సారి పోటి కూడా లేదు కాబట్టి అన్ సీజన్ ఒక్కటే ఎఫెక్ట్ చూపే అంశం. మరి ఈ సినిమా ఎంతవరకు తట్టుకుని నిలబడుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here