Home గాసిప్స్ అంతకుమించి అంట…కాచుకోండి ఇక!

అంతకుమించి అంట…కాచుకోండి ఇక!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ విషయం లో సాలిడ్ గా ప్లాన్ చేసుకుంటూ దూసుకు పోతున్నాడు. టెంపర్ కి ముందు వరకు వేరు కానీ టెంపర్ తర్వాత ఒక్క అపజయం లేకుండా దూసుకు పోతున్న యంగ్ టైగర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళు గా సినిమా లేకున్నా కానీ ఆర్ ఆర్ ఆర్ తర్వాత చేయబోయే సినిమాల విషయం లో మాత్రం ఫుల్ క్లారిటీ గా ఉన్నాడు అని చెప్పాలి.

ఇక ఆర్ ఆర్ ఆర్, ఎన్టీఆర్30 తర్వాత ఎన్టీఆర్ KGF తో ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే, ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా కి సంభందించిన ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది.

ఆ న్యూస్ ప్రకారం స్క్రిప్ట్ లో ఎలివేషన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని అంటున్నారు. ప్రతీ పావుగంట కి ఒకటి చొప్పున KGF లో ఎలివేషన్స్ పెట్టిన ప్రశాంత్ నీల్ ఇందులో అంత కన్నా ఎక్కువ ఎలివేషన్ సీన్స్ ని ఎన్టీఆర్ కోసం రాసుకుంటున్నారని శాండల్ వుడ్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది.

ఆ న్యూస్ టాలీవుడ్ కి పాకగా ఇలాంటి సీన్స్ కోసమే ఇక్కడ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. KGF సినిమా కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆ ఎలివేషన్ సీన్సే కాగా ఇప్పుడు ఆ సీన్స్ ని మించి ఎలివేషన్స్ అంటున్నారు కాబట్టి ఈ వార్తా నిజం అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ సెన్సేషన్ ని క్రియేట్ చేయడం ఖాయం..

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ కోసం అలాగే ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. షూటింగ్స్ తిరిగి మొదలు అయినా కానీ మరింత సమయం తీసుకుని షూటింగ్స్ కి వెళ్లాలని యూనిట్ భావిస్తుందట. సో ఫస్ట్ లుక్ కి మరింత టైం పట్టే చాన్స్ ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here