Home న్యూస్ వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ No1…రామ్ చరణ్ No2….మాస్ రచ్చ!!

వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ No1…రామ్ చరణ్ No2….మాస్ రచ్చ!!

0

ఆస్కార్ వేడుక ముగిసింది…ఆర్ ఆర్ ఆర్ మూవీ లో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావడంతో యావత్ దేశం ఉప్పొంగిపోయింది. ఇక్కడ ఫ్యాన్స్ కొంచం సోషల్ మీడియా వరకు ట్రోల్స్ లాంటివి చేసుకున్నా కానీ నేషనల్ లెవల్ లో ఇంటర్నేషనల్ లెవల్ లో తెలుగు సినిమా పేరు ఇండియన్ సినిమా మరింతగా పాపులర్ అయ్యాయి. ఇక ఆస్కార్ వేడుక జరిగే టైంలో వరల్డ్ వైడ్ గా కూడా ఆర్ ఆర్ ఆర్ పేరు…

ఓ రేంజ్ లో మ్రోగిపోగా అందులో నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల పేర్లు వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయ్యాయి. కాగా ఆస్కార్ జరిగినే ఈవెంట్ మొత్తం వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా సోషల్ మీడియాలో అత్యధిక మంది కామెంట్స్, ట్వీట్స్ వేసిన…

యాక్టర్స్ నేమ్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందరినీ మించి పోయి టాప్ 1 ప్లేస్ లో నిలవగా రెండో ప్లేస్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిలవడం విశేషం. ఇండియా వైడ్ గా కాదు టోటల్ వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయిన యాక్టర్స్ లిస్టులో మన హీరోలు…

ఇద్దరూ టాప్ 2 ప్లేసులలో నిలిచి దుమ్ము దుమారం లేపారు… అందులో ఎన్టీఆర్ పేరు మరింత భారీగా వినిపించి ఆల్ మోస్ట్ ఆస్కార్ ఈవెంట్ జరిగిన వీకెండ్ లో 1 మిలియన్ కి పైగా ఎన్టీఆర్ పేరు మెన్షన్స్ ట్విట్టర్ లో జరగడం విశేషం అని చెప్పాలి… ఈ రేంజ్ లో మన హీరోలు వరల్డ్ వైడ్ గా రచ్చ చేసి దుమ్ము లేపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here