యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 8 రోజుల్లో అల్టిమేట్ వసూళ్ల తో టాలీవుడ్ హిస్టరీ లో సరికొత్త రికార్డులను నమోదు చేయగా ఇప్పుడు రెండో వారం లో దసరా సెలవుల అడ్వాంటేజ్ ని ఓ రేంజ్ లో వాడుకుంటూ దూసుకుపోతున్న ఈ సినిమా 8 వ రోజు అద్బుతమైన వసూళ్లు సాధించగా ఇప్పుడు 9 వ రోజు కూడా రెండు రాష్ట్రాలలో జోరు చూపుతుంది ఈ సినిమా.
8 వ రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ ఈక్వల్ లెవల్ లో ఓపెన్ అయిన ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి కొంచం డ్రాప్స్ ని మాత్రమే 8 వ రోజు తో పోల్చితే సొంతం చేసుకుంది, కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ అద్బుతంగా ఉన్నట్లు తెలుస్తుంది.
దాంతో మరో సారి 9 వ రోజు సినిమా రెండు రాష్ట్రాలలో మినిమమ్ 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తుండటం విశేషం… దాంతో సినిమా బ్రేక్ ఈవెన్ కి మరింతగా చేరువ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.
ఇక రామ్ నటించిన హెలో గురు ప్రేమ కోసమే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 4.25 కోట్ల షేర్ ని టోటల్ గా అందుకోగా రెండో రోజు బుకింగ్స్ రెండు రాష్ట్రాలలో మొదటి రోజు తో పోల్చితే కేవలం 30% వరకు మాత్రమే డ్రాప్స్ ఉన్నాయి.
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు రెండు రాష్ట్రాలలో మినిమమ్ 2.4 కోట్ల రేంజ్ కి పైగా షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ మరింత ఎక్కువగా ఉంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక డబ్బింగ్ మూవీ పందెం కోడి 2 తొలి రోజు మొత్తం మీద రెండు రాష్ట్రాలలో 1.4 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోగా తెలుగు స్ట్రైట్ మూవీస్ కి పోటీగా మంచి వసూళ్లని సాధించింది అని చెప్పొచ్చు. కానీ రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సినిమా జోరు పెద్దగా లేదు.
కానీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగా ఉండటం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వ రోజు కూడా ఇంచుమించుగా 80 లక్షల నుండి 1 కోటి రేంజ్ లో వసూళ్లని రెండు రాష్ట్రాలలో సాధించే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి మూడు సినిమాలు అనుకున్నట్లే కలెక్షన్స్ డే ఎండింగ్ వరకు అందుకుంటాయో లేదో చూడాలి.