Home న్యూస్ అరవింద సమేత Vs హలో గురు ప్రేమ కోసమే Vs పందెం కోడి 2… బాక్స్...

అరవింద సమేత Vs హలో గురు ప్రేమ కోసమే Vs పందెం కోడి 2… బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

0

     బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజులుగా అల్టిమేట్ వసూళ్లతో జోరు చూపుతూ దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల అరివింద సమేత టోటల్ గా 140 కోట్లకు పైగా గ్రాస్ ని 85 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని ఆల్ టైమ్ రికార్డులతో దుమ్ము లేపుతున్న విషయం తెలిసిందే.  ఇక సినిమా 9 వ రోజు రెండు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 8 వ రోజు లెవల్ లోనే ఓపెన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈవినింగ్ అండ్ నైట్ షోల పరంగా మాత్రం సినిమా జోరు పెంచింది.

ఓవరాల్ గా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ సుమారు 30% ఉండగా ఈవినింగ్ షోల మరియు నైట్ షోల సమయానికి ఇది 40% ని కవర్ చేయడం తో ఓవరాల్ గ్రోత్ అదిరిపోయింది అని చెప్పొచ్చు. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 వ రోజు మినిమమ్ 2.8 కోట్ల షేర్ కంఫామ్ అనే చెప్పాలి.

అంతకి మించి ఎంత వరకు వసూల్ చేస్తుందో అనేది నైట్ షోల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఉంటుంది. ఇక మరో రిలీజ్ హెలొ గురు ప్రేమ కోసమే బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు మొదటి రోజు రేంజ్ లోనే జోరు ని కొనసాగించింది. మార్నింగ్ షోల కి సుమారు 45% ఆక్యుపెన్సీ ఉండగా…

ఈవినింగ్ అండ్ నైట్ షోల కి 55% ని టచ్ చేసింది. దాంతో రెండో రోజు సినిమా మరోసారి 3 కోట్ల మార్క్ ని అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక మూడో రిలీజ్ అయిన పందెం కోడి 2 మొదటి రోజు తో పోల్చితే కొంచం స్లో డౌన్ అయింది.

మార్నింగ్ షోల కి సుమారు 20% ఆక్యుపెన్సీ ఉండగా ఈవినింగ్ షోల కి వచ్చే సరికి 25% మాత్రమే ఆక్యుపెన్సీ ని ఓవరాల్ గా సాధించింది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు సుమారు 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి మూడు సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here