Home గాసిప్స్ అయినను పోయి రావలె హస్తినకు టైటిల్ కాన్సిల్…కొత్త టైటిల్ ఇదే!!

అయినను పోయి రావలె హస్తినకు టైటిల్ కాన్సిల్…కొత్త టైటిల్ ఇదే!!

0

 టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత రూపొందబోతున్న అప్ కమింగ్ మూవీ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే మొదలు అయ్యి సగానికి పైగా పూర్తీ కూడా అవ్వాల్సింది కానీ కరోనా వలన అది కుదరలేదు. దాంతో మరింత డిలే అవుతూ వస్తున్న ఈ సినిమా ఇప్పుడు మార్చ్ టైం లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక సినిమా కథ ఫైనల్ అవ్వలేదని, అనేక వర్షన్స్ ని మార్చారని టాక్ ఇప్పటికీ వస్తున్నప్పటికీ కూడా అవన్నీ రూమర్స్ అనే అంటున్నారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ లు కథ మొత్తం లాక్ చేశారని టాలీవుడ్ లో స్ట్రాంగ్ బజ్ ఉంది, కానీ సినిమా టైటిల్ విషయం లోనే పెద్దగా క్లారిటీ లేకుండా పోయింది అంటున్నారు.

త్రివిక్రమ్ ముందు సినిమా కి అయినను పోయి రావలె హస్తినకు అనే ఇంటరెస్టింగ్ టైటిల్ ని అలాగే అ అనే సెంటిమెంట్ ని నమ్ముకుని టైటిల్ ని డిసైడ్ చేశారు, ఆ టైటిల్ నే రిజిస్టర్ కూడా చేయించారు కానీ ఎందుకనో తర్వాత అ టైటిల్ ఉండదని టైటిల్ పాన్ ఇండియా లెవల్ లో ఒకేలా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని టాక్ వచ్చింది.

India's Biggest Birthday Trend Record Belongs To #HappyBirthdayNTR

లేటెస్ట్ గా నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్ లో మరో టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. ఆ టైటిల్ రాజా వచ్చినాడు అని… ఇది ఎవరికోసం చేయించారు అన్నది ఇంకా క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం సెట్స్ పైకి వెళ్ళాల్సిన ప్రాజెక్ట్ మాత్రం ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమానే అవ్వడం తో ఈ సినిమా కి ఇప్పుడు ఈ టైటిల్ నే అనుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

టైటిల్ ని దమ్ము సినిమాలో రాజు వచ్చినాడు సాంగ్ నుండి తీసుకున్నట్లు అనిపిస్తుంది కానీ ఇది కూడా పాన్ ఇండియా లెవల్ లో సెట్ అయ్యే టైటిల్ లా అయితే కనిపించడం లేదని సోషల్ మీడియా ఫ్యాస్స్ భావిస్తున్నారు. మరి ఈ టైటిల్ ని కన్ఫాం చేస్తారా లేక పాత టైటిల్ నే ఓకే చేస్తారా లేక కొత్త టైటిల్ ని వెతుకుటారా అన్నది సినిమా మొదలు అయ్యే టైం కి బయటికి తెలిసే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here