Home న్యూస్ ఓం భీమ్ బుష్ రివ్యూ….హిట్టు బొమ్మ బాస్!

ఓం భీమ్ బుష్ రివ్యూ….హిట్టు బొమ్మ బాస్!

0

లాస్ట్ ఇయర్ సామజవరగమనా(Samajavaragamana Movie) తో బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రీవిష్ణు(Sree Vishnu) ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన కొత్త సినిమా ఓం భీమ్ బుష్(Om Bheem Bush Movie Review Telugu) తో వచ్చేశాడు… నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ కాప్షన్ తో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకోగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే…. ముగ్గురు ఫ్రెండ్స్ గవర్న్ మెంట్ ఇచ్చే ఫ్రీ డబ్బులు, ఫ్రీ హాస్టల్ కోసం ఒక కాలేజ్ లో PhD చేస్తుంటారు….వీళ్ళని వదిలించుకోవడానికి కాలేజ్ ప్రిన్సిపాల్ రీసెర్చ్ పేరుతో బయటికి పంపిన తర్వాత వీళ్ళు భైరవపురం అనే ఊరు వెళతారు…. అక్కడ ఏం జరిగింది ఆ తర్వాత కథ ఏంటి అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….

స్టోరీ లో పెద్దగా కొత్తదనం లేకున్నా కూడా జస్ట్ ఆడియన్స్ ను నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకున్న టీం చాలా వరకు సఫలం అయ్యారు, శ్రీవిష్ణు మరోసారి ఎక్స్ లెంట్ గా నవ్వించాడు… ఇక ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణలు కూడా తమ దైన స్టైల్ లో ఆకట్టుకున్నారు. ఎక్కువ శాతం ఈ ముగ్గురు స్క్రీన్ పైనే ఉండటంతో….

ఎక్కడా పెద్దగా బోర్ లాంటివి ఫీల్ అవ్వకుండా ఫస్టాఫ్ అలా అలా సాగిపోయి మంచి ఆసక్తిని కలిగించేలా ఇంటర్వెల్ బ్యాంగ్ పడగా సెకెండ్ ఆఫ్ లో కథ కామెడీ నుండి హర్రర్ టచ్ కి మారి మంచి ఎంటర్ టైన్ మెంట్ తో సాగుతుంది…. ఎండ్ అయ్యే టైంకి ఓ మంచి కామెడీ ఎంటర్ టైనర్ చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ బయటికి రావడం ఖాయం….

సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్లు పర్వాలేదు అనిపించగా ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బాగుండేది….సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా మెప్పించాయి….డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ రొటీన్ గానే ఉన్నా కూడా చెప్పిన విధానం బాగుండటం, అనుకున్న చోట్ల కామెడీ బాగా వర్కౌట్ అవ్వడం….

ముఖ్యంగా సింగిల్ లైన్ పంచులు, కొన్ని రిఫరెన్స్ లు, కొన్ని చోట్ల హర్రర్ కామెడీ వర్కౌట్ అవ్వడం ఇలా లాజిక్ లు వెదకకుండా చూస్తె సినిమా మరీ సామజవరగమనా రేంజ్ లో కాకపోయినా చాలా వరకు నవ్వించి ఆడియన్స్ అంచనాలను అయితే అందుకుందని చెప్పొచ్చు….. 

లాజిక్ లు లాంటివి వెదికితే అక్కడక్కడా మైనస్ పాయింట్స్ ఉంటాయి కానీ లాజిక్ లేకుండా ఓన్లీ స్క్రీన్ పై కనిపించే మ్యాజిక్ ని ఎంజాయ్ చేసే ఆడియన్స్ కి సినిమా బాగానే నచ్చుతుంది. కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా సినిమా ఎండ్ అయ్యే టైంకి ఓ మంచి ఎంటర్ టైనర్ చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ బయటికి వస్తారు… ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here