Home న్యూస్ లీక్ అయిన దేవర వీడియో…..ఎన్టీఆర్ ని చూసి ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

లీక్ అయిన దేవర వీడియో…..ఎన్టీఆర్ ని చూసి ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

0

పాన్ ఇండియా రేంజ్ లో RRR movie తో సాలిడ్ గా క్రేజ్ ను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) ఆడియన్స్ ముందుకు ఆ సినిమా తర్వాత ఇప్పుడు కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్ లో చేస్తున్న దేవర(Devara Part 1 Movie) అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ అవ్వాల్సింది కానీ…

షూటింగ్ డిలే వలన రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యి సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా షూటింగ్ ను మొదటి నుండి పకడ్బందీగా ఎలాంటి లీక్ లు లాంటివి లేకుండా మ్యానేజ్ చేస్తున్న టీం కి రీసెంట్ గా ఒక చిన్న షాక్ తగిలినట్లు అయింది… సినిమా షూటింగ్ లో ఒక షార్ట్ క్లిప్ ఒకటి ఇప్పుడు…

సోషల్ మీడియాలో లీక్ అయింది….నదిలో లుంగీ గెటప్ లో ఎన్టీఆర్ నీళ్ళలో నుండి నడుచుకుంటూ వెళుతున్న సీన్ ఒకటి లీక్ అవ్వగా ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ లుక్ చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. మేకర్స్ ఆ క్లిప్ ను ఎవరు లీక్ చేశారు అన్నది వెతకడం మొదలు పెట్టినట్లు సమాచారం.

సినిమా లేటెస్ట్ షూటింగ్ ఇప్పుడు గోవాలో జరగబోతుండగా త్వరలో సినిమా మేజర్ పార్ట్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు. ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి చాలా టైం అవుతున్న నేపధ్యంలో ఈ సినిమాతో అక్టోబర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ లేపుతాడో చూడాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here