Home న్యూస్ 34.50 కోట్ల తర్వాత సినిమా….. ఓం భీమ్ బుష్ ట్రైలర్ రివ్యూ!!!

34.50 కోట్ల తర్వాత సినిమా….. ఓం భీమ్ బుష్ ట్రైలర్ రివ్యూ!!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన సామజవరగమన(Samajavaragamana Movie) తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న శ్రీ విష్ణు(Sree Vishnu) ఆ సినిమా తర్వాత మరో ఎంటర్ టైన్ మెంట్ మూవీ ఓం భీమ్ బుష్(Om Bheem Bush Movie Trailer Review) సినిమా తో..

ఆడియన్స్ ముందుకు వచ్చే వారంలో రిలీజ్ అవ్వబోతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు….. లాస్ట్ ఇయర్ సామజవరగమనతో టోటల్ రన్ లో 34.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు ఓం భీమ్ బుష్ సినిమా తో మరో హిట్ ను….

సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని అనిపించేలా ఉందని చెప్పాలి…. సినిమాలో బ్యాంగ్ బాయ్స్ అంటూ ఒక స్పెషల్ క్లబ్ ని ఏర్పాటు చేయగా అందులో చిత్ర విచిత్రమైన స్కీమ్స్ తో జనాలను మోసం చేస్తూ ఉండగా అనుకోకుండా భైరవకోన అనే ఊరుకి వెళతారు…అక్కడ ఏం జరిగింది అన్నది సినిమాగా ట్రైలర్ లో చూపించారు…

డైలాగ్స్ కొన్ని ఫన్నీ ఫన్నీగా ఉండగా విజువల్స్ అండ్ క్వాలిటీ ఎక్స్ లెంట్ గా ఉన్నాయి, సామజవరగమన తర్వాత మరోసారి ఎంటర్ టైన్ మెంట్ తో మెప్పించాడని చెప్పొచ్చు, ట్రైలర్ చూస్తుంటే కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ థియేటర్స్ కోసం దాచిపెట్టినట్లు అనిపించింది… మొత్తం మీద సినిమా మీద ఉన్న అంచనాలను ట్రైలర్ పెంచేసింది… 

బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దంచికొడుతుందో చూడాలి. అన్ సీజన్ లో ఉన్న టాలీవుడ్ కి మంచి హిట్ కూడా అవసరం అవ్వడంతో ఈ సినిమాతో శ్రీ విష్ణు ఎంతవరకు హిట్ అందుకుంటారో లేదో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here