Home న్యూస్ ఒకప్పుడు వరుస హిట్ల హీరో…..ఇప్పుడు డిసాస్టర్లు…OMG2 టీసర్ మాత్రం కుమ్మేసిందిగా!

ఒకప్పుడు వరుస హిట్ల హీరో…..ఇప్పుడు డిసాస్టర్లు…OMG2 టీసర్ మాత్రం కుమ్మేసిందిగా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీ కోవిడ్ టైంలో వరుస పెట్టి హిట్స్ ను సొంతం చేసుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన తర్వాత సినిమాలలో ఒక్క సూర్యవంశీ సినిమా మాత్రం అనేక ఫ్యాక్టర్స్ వలన విజయాన్ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత థియేటర్స్ లో…

రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా తీవ్రంగా నిరాశ పరిచాయి. బచ్చన్ పాండే, సామ్రాట్ పృద్విరాజ్, రక్షా భందన్, రామ్ సేతు మరియు ఇప్పుడు సేల్ఫీ లాంటి సినిమాలు అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఒకటికి మించి ఒకటి…

ఫ్లాఫ్ రిజల్ట్ లను సొంతం చేసుకోగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఆగస్ట్ 11న రిలీజ్ కాబోతున్న అక్షయ్ కుమార్ కొత్త సినిమా ఓ మై గాడ్ 2(OMG2 Teaser) టీసర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా టీసర్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ అయ్యేలా కనిపిస్తుంది.

2011 టైంలో వచ్చిన ఓ మై గాడ్ సినిమా నాస్తికుడికి అండగా నిలిచిన శ్రీ కృష్ణుడిగా నటించిన అక్షయ్ కుమార్ ఇప్పుడు ఓ మై గాడ్ 2 లో ఆస్తికుడికి అండగా నిలిచిన మహా శివునిగా అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. టీసర్ లో శివలింగం పై నీళ్ళు పోయడం అవే నీళ్ళు…

అక్షయ్ కుమార్ పై పడటం, టీసర్ ఎండ్ లో హీరో ఇంటి బయటికి వెళ్ళిన టైం లో హీరో వెనక గంగిరెద్దు వెళ్ళడం లాంటి సీన్స్ హైలెట్ గా నిలిచాయి. టీసర్ ఓవరాల్ గా మంచి ఇంప్రెషన్ ని కలిగించడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే రేంజ్ లో సినిమా ఇంప్రెస్ చేస్తే 5 ఫ్లాఫ్స్ తర్వాత ఈ సినిమాతో ఎక్స్ లెంట్ కంబ్యాక్ ని హీరో సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here