Home న్యూస్ 55M అటు…1.83M ఇటు…తుక్కు తుక్కుగా కొట్టిన కింగ్ ఖాన్!!

55M అటు…1.83M ఇటు…తుక్కు తుక్కుగా కొట్టిన కింగ్ ఖాన్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా ఏళ్ళుగా హిట్ కోసం ఎదురు చూసిన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) ఈ ఇయర్ పఠాన్(Pathaan) సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ ను ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మరో సారి…

రికార్డులను సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు…. అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ జవాన్(Jawan Movie) సెప్టెంబర్లో 7న రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఫస్ట్ ప్రివ్యూ అంటూ ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు…

టీసర్/ట్రైలర్ అన్నది క్లారిఫై చేయలేదు కానీ లెంత్ ను బట్టి ట్రైలర్ లా భావించవచ్చు. ఇక ఈ ట్రైలర్ కి 24 గంటల్లో కేవలం బాలీవుడ్ మూవీస్ పరంగా సంచలన రెస్పాన్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి. మొత్తం మీద 24 గంటల్లో హిందీ వర్షన్ కి గాను ఈ ట్రైలర్ కి…

45.66 మిలియన్ వ్యూస్ ని అందుకోగా లైక్స్ పరంగా 1.4 మిలియన్ వ్యూస్ ని అందుకుని ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా తమిళ్ వర్షన్ 5.87 మిలియన్ వ్యూస్ ని అందుకోగా లైక్స్ పరంగా 281K లైక్స్ ని అందుకుంది. ఇక తెలుగు వర్షన్ ట్రైలర్…

3.6 మిలియన్ వ్యూస్ ని 155K లైక్స్ ని అందుకుంది. మొత్తం మీద అన్ని వర్షన్ లు కలిపి 24 గంటల్లో 55.13 మిలియన్ వ్యూస్ ని అందుకోగా లైక్స్ పరంగా 1.83 మిలియన్ లైక్స్ ని అందుకుని తుక్కు తుక్కుగా బాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ కూడా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here